Bigg Boss 6 Telugu- Raj: ఈ వారం బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వెళ్ళడానికి శ్రీ సత్య, శ్రీహాన్ , ఇనాయ, రేవంత్ , రాజ్,ఆది రెడ్డి, రోహిత్ , మరీనా మరియు కీర్తి నామినేటైన సంగతి మన అందరికి తెలిసిందే..వీరిలో ఈ వారం నామినేషన్స్ నుండి ఇమ్యూనిటీ కల్పించేందుకు బిగ్ బాస్ ఒక అవకాశం ఇచ్చాడు..బిగ్ బాస్ టైటిల్ విన్నింగ్ ప్రైజ్ 50 లక్షలలో నామినేటైన ఇంటి సభ్యులు సేఫ్ అవ్వడానికి ఒక యూనిక్ అమౌంట్ బిడ్ చెయ్యాల్సి ఉంటుంది..అంటే ఒక కంటెస్టెంట్ బీడ్ చేసిన అమౌంట్ మరో కంటెస్టెంట్ బిడ్ చెయ్యకూడదు.

అలా ఎవ్వరు ఊహించని హైయెస్ట్ యూనిక్ అమౌంట్ ఎవరైతే బిడ్ చేస్తారో వాళ్ళు నామినేషన్స్ నుండి తప్పించుకుంటారు..ఇందుకోసం కంటెస్టెంట్స్ బిడ్ చెయ్యాల్సిన కనీసం అమౌంట్ లక్ష రూపాయిలు కాగా, గరిష్ట అమౌంట్ 5 లక్షల వరుకు ఉంటుంది..అలా బిగ్ బాస్ ఇచ్చిన ఈ అద్భుతమైన అవకాశం ని వాడుకోవడానికి ఇంటి సభ్యులు ఎవరి వ్యూహాలతో వారు అమౌంట్ ని బిడ్ చెయ్యడం ప్రారంభిస్తారు.
ముందు గా శ్రీహాన్ మరియు ఆది రెడ్డి ఓట్ల ద్వారానే సేఫ్ అవ్వాలనే లక్ష్యం తో కేవలం లక్ష రూపాయలకే చెక్ రాసి ద్రో బాక్స్ లో వేస్తారు..ఆ తర్వాత కీర్తి, రేవంత్ వంటి వారు 4 లక్షల 99 వేల 998 రూపాయిల చెక్ రాసి డ్రాప్ బాక్స్ లో వేస్తె మిగిలిన ఇంటి సభ్యులు అధిక శాతం 4 లక్షల 99 వేల 999 రూపాయలకు బిడ్ చేస్తూ చెక్ రాసి డ్రాప్ బాక్స్ లో వేస్తారు..రోహిత్ మాత్రం రెండు లక్షల 15 వేల రూపాయలకు చెక్ రాసి డ్రాప్ బాక్స్ లో వేస్తాడు.

అయితే బిగ్ బాస్ ఇచ్చిన రూల్స్ ప్రకారం కంటెస్టెంట్స్ తాము రాసే చెక్ అమౌంట్స్ గురించి ఎవరితో చర్చించకూడదు..కానీ శ్రీ సత్య చర్చిస్తుంది..దీనితో ఆమెని బిగ్ బాస్ ఈ గేమ్ నుండి తొలగిస్తాడు..ఇక రాజ్ తెలివిగా ఎవ్వరి ఊహకి అందకుండా 4 లక్షల 99 వేల 700 వేల రూపాయిలు బిడ్ చేసి డ్రాప్ బాక్స్ లో వేస్తాడు..ఎవ్వరు వెయ్యని హైయెస్ట్ యూనిక్ అమౌంట్ బిడ్ చేసిన కంటెస్టెంట్ గా నిలిచి నామినేషన్స్ నుండి సేవ్ అవుతాడు.