Inaya Sultana vs Srihan: బిగ్ బాస్ సీసన్ 6 సరికొత్త టాస్కులతో ఆసక్తికరం గా సాగుతూ ఇప్పుడు 7 వ వారం లోకి అడుగుపెట్టిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ వారం నామినేషన్స్ గత వారం తో పోలిస్తే చాలా వాడివేడిగా సాగింది..ఇంటి సభ్యుల మధ్య పరస్పరం వాదనలతో, చీత్కారాలతోనే ఈ వారం నామినేషన్స్ సాగింది..అయితే విచిత్రం ఏమిటంటే ప్రతి వారం నామినేషన్స్ లో ఉండే గీతూ ఈసారి నామినేషన్స్ లో లేకపోవడం విశేషం..ఒక్కరు కూడా ఆమెని నామినేట్ చెయ్యలేదు..ఎక్కువ శాతం పాపం బాలాదిత్య మరియు రేవంత్ కి నామినేషన్స్ చేసారు.

వీళ్ళిద్దరితో పాటుగా శ్రీహాన్, ఇనాయ సుల్తానా , శ్రీ సత్య , వాసంతి , రోహిత్, మెరీనా, అర్జున్ కళ్యాణ్ , ఆది రెడ్డి, ఫైమా , కీర్తి , రాజ్ శేఖర్ ఇలా ఏకంగా 13 మంది ఇంటి సభ్యులు నామినేట్ అయ్యారు..అయితే ఈ నామినేషన్స్ హౌస్ లో కాస్త ఎక్కువ హీట్ ని పెంచింది ఇనాయ సుల్తానా మరియు శ్రీహాన్ మధ్య వాదనలు.
బిగ్ బాస్ హౌస్ లో అడుగుపెట్టిన రోజు నుండే వీళ్లిద్దరి మధ్య సరైన సఖ్యత ఉండటం లేదనే విషయం మన అందరికి తెలిసిందే..అయితే కొద్దీ రోజుల తర్వాత వీళ్లిద్దరి మధ్య గొడవలు తగ్గడం తో స్నేహితులు అయిపోయారని అందరూ అనుకున్నారు..కానీ ఈరోజు జరిగిన నామినేషన్స్ లో వీళ్లిద్దరు తగువులు వేసుకోవడం చూసి, అబ్బే..వీళ్ళు అసలు ఏమి మారలేదని చూసే ప్రేక్షకులకు అర్థం అయిపోయింది..ముందుగా శ్రీహాన్ ఇనాయ సుల్తానా ని నామినేట్ చేస్తూ ‘మొన్న ఆదివారం ఆడిన టాస్కు లో చివరినా నువ్వు మమల్ని ఉద్దేశించి ‘లయర్స్’ అన్నావు..అది నాకు అసలు నచ్చలేదు..అందుకే నామినేట్ చేస్తున్నాను’ అని అంటాడు శ్రీహాన్.

అప్పుడు ఇనాయ ‘నువ్వు కావాలనే నన్ను రెచ్చగొడుతున్నావు..నేను ఎక్కడ ఆ మాట అన్నాను..అబ్బద్దాలు చెప్పకు’ అంటూ శ్రీహాన్ మీద విరుచుకుపడుతుంది..అప్పుడు శ్రీహన్ పొగరుగా మాట్లాడుతూ ‘నువ్వు ఏమి చేసావో అందరూ చూసారు కానీ..వెళ్లి కూర్చో పో’ అంటాడు..ఇక ఆ తర్వాత మళ్ళీ నామినేషన్స్ చెయ్యడానికి ఇనాయ వంతు వచ్చినప్పుడు..ఇనాయ శ్రీహన్ ని నామినేట్ చేస్తుంది.
అప్పుడు ఆమె మాట్లాడుతూ ‘ఆ సోఫా లో నా ఛుమ్కీలు పాడినప్పుడు..నీకు ఇబ్బందిగా ఉంటె నాకు చెప్పకుండా..సూర్య కి చెప్పావ్..మాటికొస్తే ఆ టాపిక్ తెస్తూనే ఉన్నావ్..ఏమి నాతో నాతో చెప్పడానికి భయమా నీకు’ అని అడుగుతుంది..అప్పుడు శ్రీహన్ మాట్లాడుతూ ‘నేను ఏ సమస్య వచ్చినా నా కెప్టెన్ తో చెప్పుకుంటాను..నీకు ఎందుకు..అది నా ఇష్టం..సరే ఇప్పుడు నీకే చెప్తున్నాను..వెళ్లి ఆ సోఫా లో పడున్న ఛుమ్కీలు అన్ని తియ్యి పో’ అంటూ బదులుస్తాడు..అలా వీళ్ళ మధ్య చర్చ సాగుతూ ఏకవచనంతో తిట్లు కూడా తిట్టుకుంటారు..ఇది ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.