Geetu- Kaushal: బిగ్ బాస్ ని వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ గీతూ ఎలిమినేషన్ కోలుకోలేని షాక్ ఇచ్చింది.. బిగ్ బాస్ కి తిరుగులేని కంటెంట్ ఇచ్చే ఈమె ఎలిమినేట్ అవ్వడం ఏమిటి అని ఆమె అభిమానులు బాధపడుతున్నారు.. మరో పక్క ఆమెని ద్వేషించేవాళ్లేమో ‘బిగ్ బాస్ కి పట్టిన దరిద్రం వదిలింది.. ఇక ప్రశాంతంగా చూడొచ్చు’ అని అనుకుంటున్నారు..ఒక స్ట్రాంగ్ కంటెస్టెంట్ కి ఫ్యాన్స్ ఎంతమంది అయితే ఉంటారో..అంతమంది ద్వేషించేవాళ్ళు కూడా ఉండడం సర్వసాధారణం.. అలాగే గీతూ విషయం లో కూడా అంతే.

గత వారంలో ఆమె బాలాదిత్య బలహీనతతో ఆడుకోకపోయి ఉంటే ఈరోజు ఆమె ఇలా ఎలిమినేట్ అయ్యే పరిస్థితి ఉండేది కాదు పాపం.. అంతేకాకుండా అంతకు ముందు వారంలో కూడా సంచాలక్ అయ్యిండి గేమ్ ఆడడం ఆమెపై నెగెటివిటీని తీవ్రస్థాయిలో పెంచేలా చేసింది.. కానీ ఎలిమినేట్ అయ్యి వెళ్ళేటప్పుడు ఆమె ఏడ్చినా ఏడుపుని చూసి మాత్రం చాలామందికి ‘పాపం ఇంకో అవకాశం ఇస్తే బాగుండును’ అని అనిపించింది.
ఇక ఈరోజు ఆమె తన యూట్యూబ్ ఛానల్ లో లైవ్ ఇచ్చింది.. సుమారు గంటసేపు ఆమె ఈ లైవ్ వీడియోలో మాట్లాడింది.. ఇందులో ఆమె ప్రధానంగా బిగ్ బాస్ సీజన్ 2 టైటిల్ విన్నర్ కౌశల్.. బిగ్ బాస్ -4 టైటిల్ విన్నర్ అభిజీత్ పై చేసిన కొన్ని కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారాయి

ఆమె మాట్లాడుతూ ‘మనం మేల్ డామినేషన్ సొసైటీ లో బతుకుతున్నాం.. అందుకే ఈరోజు నేను ఎలిమినేట్ అయ్యి మీ ముందు ఇలా బాధపడుతూ కూర్చున్నాను.. కొన్ని ఉదాహరణలు చెప్తాను..బిగ్ బాస్ 2 టైటిల్ విన్నర్ కౌశల్ అద్భుతమైన గేమర్.. అందులో ఎలాంటి డౌట్ లేదు.. కానీ అతను హౌస్ లోకి అడుగుపెట్టినప్పుడు.. నాకు ఎమోషన్స్ లేవు..కేవలం నా ఫోకస్ గేమ్ మీద మాత్రమే అని అతను చివరి వరుకు ఎవరితో రిలేషన్ పెట్టుకోకుండా ఆట ఆడాడు.. అలా ఆయన ఆడినప్పుడేమో అద్భుతమైన గేమర్ అన్నారు.. అదే తరహాలో నేను ఆడితే నీకు మనసు లేదు.. నువ్వు మనిషివి కాదు అని నెగటివ్ కామెంట్స్ చేసారు’.
‘బిగ్ బాస్ 4 టైటిల్ విన్నర్ అభిజిత్ విషయంలో కూడా అదే జరిగింది.. అతను తెలివిగా ఆడాడు.. అతను కూడా ఒక సందర్భంలో అమ్మా రాజశేఖర్ గారి సిగరెట్లు దాచిపెట్టాడు.. అతను చేస్తేనేమో ఆటలో భాగంగా అద్భుతమైన స్ట్రాటజీ అన్నారు..అదే నేను చేస్తే మోస్ట్ కన్నింగ్ మనిషిని అన్నారు.. అందుకే నేను మేల్ డామినేషన్ సొసైటీ అంటున్నాను.. అందులో ఎలాంటి తప్పు లేదు’ అని ఆమె చేసిన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.