Bigg Boss 6 Telugu- Rohit: ఈ వారం కూడా బిగ్ బాస్ హౌస్ ప్రేక్షకుల అంచనాలకు అందకుండా పూర్తి బిన్నంగా కొనసాగింది..టికెట్ 2 ఫినాలే టాస్కు తో ప్రేక్షకుల్లో ఉత్కంఠని కలిగించడం లో బిగ్ బాస్ నూటికి నూరుపాళ్ళు సక్సెస్ సాధించారు..ఈ టాస్క్ ఈ వారం ఎలిమినేషన్స్ కి చాలా కీలకంగా మారింది..ఎందుకంటే ఈ నామినేషన్స్ లోకి వచ్చిన అందరి కంటెస్టెంట్స్ లో ఆది రెడ్డి మరియు ఫైమా కి చివరి రెండు స్థానాలు దక్కాయి..ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉందని ఫిలిం నగర్ లో గట్టిగా వినిపిస్తున్న టాక్.

అదే కనుక నిజమైతే పాపం ఆది రెడ్డి, ఫైమా ఎలిమినేట్ అయిపోతారు..ఫైమా ఎలిమినేట్ అయిపోయిన ఆడియన్స్ పెద్దగా ఫీల్ అవ్వట్లేదు కానీ..ఆది రెడ్డి ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనే వార్త మాత్రం ఆడియన్స్ ని బాగా నిరాశకి గురి చేస్తుంది..ఎందుకంటే ఒక రివ్యూయర్ గా కామన్ మ్యాన్ గా బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన ఆదిరెడ్డి ఇంత దూరం రావడం అంటే మాటలు కాదు.
ఫిజికల్ గా అతను బాగా స్ట్రాంగ్ కాబట్టి ఫిజికల్ టాస్కులు బాగానే ఆడుతాడు..కానీ తనకి చేతకాని ఎంటర్టైన్మెంట్ కోణంలో కూడా ఆది రెడ్డి శబాష్ అనిపించుకున్నాడు..టికెట్ 2 ఫినాలే టాస్కు లో అందరికంటే ముందుగా ఎక్కువ పాయింట్స్ దక్కించుకున్న ఆది రెడ్డి చివరి నిమిషం లో ఓడిపోవడం అతని బ్యాడ్ లక్ అనే చెప్పాలి..సంచాలక్స్ తీసుకున్న డెసిషన్ ప్రకారం రోహిత్ , ఫైమా మరియు రేవంత్ టాస్కులో ఆడివుంటే ఈరోజు పరిస్థితి వేరేలా ఉండేదేమో..కానీ రోహిత్ సంచాలక్స్ నిర్ణయం ని తిరస్కరించి టాస్కులో ఆడకుండా త్యాగం చెయ్యడం వల్ల ఆది రెడ్డి , ఫైమా బిగ్ బాస్ హౌస్ నుండి ఈ వారం ఎలిమినేట్ అయిపోతున్నారని సోషల్ మీడియా లో ఒక టాక్ వినిపిస్తుంది.

ఒకవేళ రోహిత్ ఈ టాస్కు ఆడదానికి ఒప్పుకొని ముందుకొచ్చి ఉంటె శ్రీహాన్ టికెట్ 2 ఫినాలే రేస్ నుండి తప్పుకునే అవకాశం ఉండేది..అప్పుడు ఆది రెడ్డి కి ఫైమా/రోహిత్ లలో కరితో చివరి లెవెల్ పోటీ జరిగి ఉండేది..ఆ పోటీలో ఆదిరెడ్డి గెలిచి ఫైనల్స్ కి వెళ్లే అవకాశం కూడా ఉండేది..రోహిత్ తీసుకున్న ఈ చిన్న నిర్ణయం వల్ల గేమ్ మొత్తం మారిపోయింది అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి.