Bigg Boss 6 Telugu- Baladitya: ఈమధ్య బిగ్ బాస్ లో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం చాలా కష్టం అయిపోయింది..గడిచిన నాలుగు వారాల నుండి ఎవ్వరు ఊహించని ఎలిమినేషన్స్ జరుగుతున్నాయి..విచిత్రం ఏమిటి అంటే కంటెస్టెంట్స్ ఎప్పటి నుండి అయితే ఆడడం ప్రారంభిస్తున్నారో ఆ వారమే ఎలిమినేట్ ఐపోతున్నారు..అర్జున్ కళ్యాణ్ మరియు సూర్య విషయం లో అదే జరిగింది..ఇక మొదటి వారం నుండి ఎంటర్టైన్మెంట్ పంచడం లోను..టాస్కులు ఆడడం లోను తిరుగులేని కంటెంట్ ఇచ్చే గీతూ కూడా ఎలిమినేట్ అవ్వడం పెద్ద షాక్ అనే చెప్పాలి.

ఈ షాక్ నుండి ఇంటి సభ్యులే కాదు..ప్రేక్షకులు కూడా ఇంకా తేరుకోలేదు..ఇలా వరుసగా బాగా ఆడవాళ్లు మరియు కంటెంట్ ఇచ్చే వాళ్ళు ఎలిమినేట్ అవ్వడాన్ని చూస్తుంటే బిగ్ బాస్ ఈ సీజన్ మొత్తం ‘అన్ ఫెయిర్’ అని ప్రేక్షకులకు అనిపిస్తుంది..ఇక వారం ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి రేవంత్ , శ్రీహాన్,ఆది రెడ్డి , బాలాదిత్య , ఫైమా , ఇనాయ సుల్తానా, మరీనా , వాసంతి మరియు కీర్తి నామినేట్ అయ్యారు.
వీరిలో ప్రస్తుతం జరిగిన వోటింగ్ ప్రకారం చూస్తే రేవంత్ మరియు ఇనాయ సుల్తానా ఒకటి , రెండవ స్థానాల్లో కొనసాగుతుండగా..బాలాదిత్య మరియు వాసంతి చివరి రెండు స్థానాల్లో కొనసాగుతూ డేంజర్ జోన్ లో ఉన్నారు..వీళ్లిద్దరి మధ్య ఓట్ల తేడా చాలా స్వల్పం గా ఉండడం తో ఎవరు ఎలిమినేట్ అవ్వబోతున్నారు అనేది చెప్పడం కష్టం అవుతుంది..అయితే అధిక శాతం బాలాదిత్య ఎలిమినేట్ అవ్వడానికి స్కోప్ ఉంది..బాలాదిత్య మొదటి నుండి టాస్కులు మంచిగానే ఆడుతాడు కానీ..ఎంటర్టైన్మెంట్ ఇచ్చే విషయం లో చాలా అంటే చాలా తక్కువ.

దానికి తోడు ఏదైనా విషయం పట్టుకుంటే సాగదీసి అందరికి చిరాకు రప్పిస్తాడు..గత వారం గీతూ ఎలిమినేట్ అవ్వడానికి ప్రధాన కారణం బాలాదిత్య..ఈ వారం అతను ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉండడం తో గీతూ ఫాన్స్ సంతోషపడుతున్నారు..చూడాలిమరి సోషల్ మీడియా లో జరుగుతున్నా అనధికార పొలింగ్స్ ని బట్టి తక్కువ ఓట్లు ఉన్న బాలాదిత్య ఎలిమినేట్ అవుతాడా..లేదా వాసంతి ఎలిమినేట్ అవుతుందా అనేది.