Pawan Kalyan: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు పవన్ కళ్యాణ్ వర్సెస్ జగన్ మధ్య నువ్వా నేనా అనే రేంజ్ లో సాగుతున్నాయి.. ఉత్తరాంధ్ర ప్రాంతంలో పవన్ కళ్యాణ్ నిర్వహించాలన్న ‘జనవాణి’ కార్యక్రమాన్ని వైసీపీ ప్రభుత్వం బలవంతంగా ఆపే దగ్గర నుండి ప్రారంభమైన పోరు ఇప్పటికి ఈ రెండు పార్టీల మధ్య కొనసాగుతూనే ఉంది..ఇప్పుడు తాజాగా ఇప్పటం గ్రామంలో అన్యాయం గా ప్రజల ఇళ్లను రోడ్డు విస్తరణ పేరుతో కూల్చివేయడం రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపింది.

ప్రభుత్వ అధికారుల హెచ్చరికలను ఖాతరు చేయకుండా పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటం ప్రజలు స్వచ్చందంగా భూములు ఇవ్వడంతో కక్ష గట్టిన అధికారులు నోటీసులు ఇచ్చి ఇళ్ళని కూల్చేయడం..పవన్ కళ్యాణ్ ఆ గ్రామానికి వెళ్లి ప్రజలకు అండగా నిలబడడం వంటివి ఇప్పుడు రాజకీయాల్లో ప్రకంపనలు రేపుతోంది..పవన్ కళ్యాణ్ దాటికి అధికార వైసీపీ పార్టీ విలవిలలాడిపోతుంది.
ఇప్పుడు తాజాగా వైసీపీ దాష్టీక పాలనకు వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఫాలోవర్స్ వైసీపీకి ముచ్చమటలు పట్టిస్తున్నారు.. పవన్ కళ్యాణ్ కూడా తన ట్విట్టర్ ఖాతాలో ఈరోజు వేసిన వీడియోలు తెగ వైరల్ గా మారిపోయాయి..’మనల్ని పాలించిన రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం బ్రిటిన్ దేశానికీ మన ఇండియన్ రిషి సనక్ ప్రధాన మంత్రి అవ్వగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు..ఇక్కడ ఎందుకు ఫుడలిస్టిక్ వ్యవస్థ అవతల వాళ్ళని రానివ్వకుండా చేస్తుంది..ఎంత కాలం రానివ్వకుండా ఉంటారు..భారతదేశం స్వాతంత్రం సంపాదించుకొని మనం చేసిన అద్భుతం ఏమిటి అంటే’ ‘పంచాయితీ ఎన్నికలలో ఒక అణగారిన వర్గానికి చెందిన ఒక యువకుడు కూర్చొని స్వేచ్ఛగా నేను నామినేషన్ వేద్దాం అని వచ్చే పరిస్థితులు లేవు..దీని గురించి ఏమనాలి..బ్రిటిష్ వాళ్ళు వదిలి వెళ్లిపోయిన తర్వాత కూడా ఇంకా ఊడిగం ఎవరి కోసం చేస్తారు..నామినేషన్స్ వెయ్యడానికి అర్హత కూడా లేదంటూ భయపెట్టేస్తూ ఉంటె దీనిని ఎలా ఎదురుకోవాలి..ఫ్యూడలిస్టిక్ కోటలను ఇక బద్దలు కొట్టక తప్పదు’ అంటూ పవన్ కళ్యాణ్ వేసిన ఒక ఎమోషనల్ వీడియో సోషల్ మీడియా ని ఊపేస్తోంది.

ఇటీవల నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని తుమ్మలకుంట అనే గ్రామంలో బలికిరి ప్రణయ్ కుమార్ అనే ఒక కుర్రాడు.. కొద్దీ నెలల క్రితం జరిగిన ఎంపీటీసీ ఎన్నికలలో పోటీ చేశాడు.. మాల కులానికి చెందిన ఈ వ్యక్తిని గత కొంతకాలంగా తమ గ్రామ సమస్యల మీద పోరాటం చేస్తున్నందుకు చాలా రోజుల నుండి ఇతనికి అధికార పార్టీ కి సంబంధించిన వారి నుండి బెదిరింపులు వస్తూనే ఉన్నాయి. కానీ వాటిని లెక్క చెయ్యకుండా పోరాటం కొనసాగిస్తూ అడ్డు రావడంతో ఇతని ప్రాణాలను సైతం తీసేసారు కొందరు.. అతని తల్లి పవన్ కళ్యాణ్ వద్దకి వచ్చి ‘నా బిడ్డని వైసీపీ వాళ్ళు చంపేశారు బాబు’ అంటూ ఏడుస్తూ ఆయన కాళ్ళ మీద పడిన వీడియో ని పవన్ కళ్యాణ్ తన ట్విట్టర్ ఖాతాలో అప్లోడ్ చేసాడు..ఈ వీడియో చూస్తే గుండె బరువెక్కిపోతోంది..నడవలేని స్థితిలో లో ఉన్న ఆ తల్లి గోడుని చూస్తే మన కంట నుండి నీళ్లు రాక తప్పదు..వైసీపీ అరాచకాలకు అద్దంగా నిలిచిన ఈ సంఘటన చూసి పవన్ కళ్యాణ్ ఈ వీడియో రూపొందించాడు. అదే ఇప్పుడు వైరల్ అయ్యింది.
— Pawan Kalyan (@PawanKalyan) November 8, 2022