Bigg Boss 6 Telugu 9th Week Nominations: ఈ వారం నామినేషన్స్ లో ఇనయా, గీతూ అందరి టార్గెట్ అయ్యాడు. హోస్ట్ నాగార్జున గీతూ గేమ్ ని , సంచాలక్ గా వ్యవహరించిన తీరును తీవ్రంగా తప్పుబట్టారు. ఆట ఆడించడానికి ట్రై చేశానన్న గీతూని ఏకిపారేశారు. ఆట ఆడించడానికి నువ్వెవరు… బిగ్ బాస్ ఉన్నాడంటూ స్ట్రాంగ్ గా చెప్పాడు. ఇదే పాయింట్ పై గీతూని కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. గీతూ తర్వాత ఎక్కువ నామినేషన్ ఓట్లు ఇనయాకు పడ్డాయి. ఆమెది కన్నింగ్ గేమ్ అని మెజారిటీ కంటెస్టెంట్స్ ఆరోపించారు.

అలాగే సూర్యకు వెన్నుపోటు పొడిచావని విమర్శించారు. ఇంట్లో ఎంతో ప్రేమించినట్లు నటించి సూర్యను నామినేట్ చేశావు. ఎలిమినేటై వెళ్లిపోతుంటే ఏడ్చావు. నామినేట్ చేస్తే సూర్య వెళ్ళిపోతాడని తెలిసినప్పుడు, వెళ్ళిపోతే బాధపడతావని తెలిసినప్పుడు ఎందుకు నామినేట్ చేశావని ఆదిరెడ్డి ప్రశ్నించాడు. ఇనయాకు మంచి ఫ్రెండ్ గా ఉన్న ఫైమా సైతం ఓ రేంజ్ లో ఫైర్ అయ్యింది. నామినేషన్స్ లో ఫైమా-ఇనయా మధ్య సీరియస్ వాగ్వాదం చాలా సేపు నడిచింది.
నామినేషన్స్ ప్రకియ పూర్తి అయ్యాక ఇనయా ఒక గదిలోకి వెళ్లి తలుపేసుకొని ఏడుస్తూ కూర్చుంది. ఇనయా కనిపించకపోవడంతో ఇంటి సభ్యులు కంగారు పడ్డారు. ఆమె గదిలో ఉందని తెలుసుకొని బయటకు రావాలనిక్ కోరారు. బిగ్ బాస్ నన్ను కన్ఫెషన్ రూమ్ కి పిలవాలి. అప్పుడే నేను బయటకు వస్తానని చెప్పింది. ఈ మధ్యలో రేవంత్ ఏకంగా తలుపు బద్దలు కొట్టే ప్రయత్నం చేశాడు. అయితే బిగ్ బాస్ ఇనయాను బిగ్ బాస్ కన్ఫెషన్ రూమ్ కి పిలవడం జరిగింది.

ఇనయాను నామినేట్ చేసిన శ్రీసత్య నామినేషన్స్ తర్వాత కూడా ఆమెపై ఆరోపణలు చేసింది. రాజ్ తో మాట్లాడుతూ… సూర్యతో అంత క్లోజ్ గా ఉంది. హగ్గులు పెట్టింది. అప్పుడు తెలియదా బుజ్జమ్మ బాధపడుతుందని. సూర్య బుగ్గలపై, నుదుటిపై ముద్దుల వర్షం కురిపించింది. బుజ్జమ్మ బాధపడుతుందనుకుంటే అప్పుడు ఎందుకు అలా చేసిందని అసహనం వ్యక్తం చేసింది. కెప్టెన్సీ టాస్క్ లో కూడా గేమ్ సరిగా ఆడండి అన్న ఇనయాను శ్రీసత్య మాటలతో అటాక్ చేసింది. నేను ఫ్రెండ్ కి హెల్ప్ చేస్తున్నా, నీలా వెన్నుపోటు పొడవడం లేదని కౌంటర్ వేసింది. మొత్తంగా ఇనయాను శ్రీసత్య ఫుల్ గా టార్గెట్ చేసింది.