BiggBoss 6 Arjun Kalyan: తెలుగు ప్రేక్షకులందరూ ఎప్పుడెప్పుడా అని వెయ్యి కళ్ళతో ఎదురు చూసిన బిగ్ బాస్ సీసన్ 6 ఎట్టకేలకు మొన్న ఆదివారం నాడు ఘనంగా ప్రారంభమైన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ బిగ్ బాస్ హౌస్ లోకి అర్జున్ కళ్యాణ్ ఒక కంటెస్టెంట్ గా అడుగుపెట్టాడు..హౌస్ లోకి అడుగుపెట్టేముందే తనకి గతం లో ఒక లవ్ స్టోరీ ఉండేదని..కానీ కొన్ని అనుకోని కారణాల వాళ్ళ బ్రేయాకప్ అయ్యిందని..బ్రేకప్ అయినా తర్వాత మానసికంగా ఎంతో బాదపడ్డాడనని..అదే నా జీవితం లో చోటు చేసుకున్న చేదు అనుభవం అంటూ చెప్పుకొచ్చిన సంగతి మనమంతా చూసాము..ఇంతకీ ఆయన లవ్ ట్రాక్ నడిపింది ఎవరితోనో కాదు..ఇప్పుడిప్పుడే టాలీవుడ్ లో హీరోయిన్ గా నిలదొక్కుకుంటూ వస్తున్నా పూజిత పొన్నాడ తో..పూజిత పొన్నాడ అనే పేరు వింటే సగం మందికి ఆమె ఎవరో తెలియకపోవచ్చు..కానీ రంగస్థలం సినిమాలో రామ్ చరణ్ అన్నయ్య గా చేసిన ఆది పినిశెట్టి లవర్ అంటే టక్కుమని గుర్తు పట్టేస్తారు.

పూజిత పొన్నాడ హైదరాబాద్ లో ఒక ప్రముఖ MNC కంపెనీ లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేస్తూ ఉంటుంది..ఆమెకి తీరిక సమయం దొరికినప్పుడల్లా షార్ట్ ఫిలిమ్స్ లో నటిస్తూ ఉండేది..అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా మన టాలీవుడ్ డైరెక్టర్స్ కంటపడి సినిమాల్లో నటించే అవకాశాలు దక్కించుకుంది..కానీ ఆమె సినిమాల్లో నటిస్తున్నప్పటికీ కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగం ని మాత్రం వదలలేదు..ఇప్పటికి ఆమె ఒక పక్క సినిమాలు చేస్తూనే మరో పక్క సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది..ఇది కాసేపు పక్కన పెడితే ఇటీవలే ఆమె హీరోయిన్ గా నటించిన ‘ఆకాశ వీధుల్లో’ అనే సినిమా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.

ఈ సినిమా విడుదలకి ముందు ఆమె ఎన్నో ఇంటర్వూస్ లో పాల్గొన్నది..ఈ ఇంటర్వూస్ లో ఆమె తానూ భవిష్యత్తులో చెయ్యబొయ్యే ప్రాజెక్ట్స్ గురించి చెప్తూనే..తన వ్యక్తిగత విషయాలను కూడా చాలానే పంచుకుంది..అలా ఆమె తన వ్యక్తిగత విషయాలు చెప్తున్న సమయం లో అర్జున్ కళ్యాణ్ తో తనకి ఉన్న లవ్ ట్రాక్ గురించి చెప్పుకొచ్చింది..ఇద్దరం ప్రేమించుకున్నామని..ముందుగా అర్జున్ కళ్యాణ్ నాకు ప్రపోజ్ చేసాడని..ఆ తర్వాత కొనేళ్లు ప్రేమించుకున్న తర్వాత డేటింగ్ కూడా చేసుకున్నామని..కానీ ఎందుకు మా ఇద్దరి ఇష్టాయిష్టాలు కలవకపోవడం వల్ల ఇద్దరం మాట్లాడుకొనే బ్రేకప్ అయ్యామని..మా బ్రేకప్ చాలా శాంతియితంగా జరిగిందని..ఎలాంటి గొడవలు జరగలేదని చెప్పుకొచ్చింది పూజిత పొన్నాడ..ఇప్పటికి తనని నేను బెస్ట్ ఫ్రెండ్ గానే చూస్తానని..కలిసినప్పుడు బాగానే మాట్లాడుకుంటామని..బిగ్ బాస్ లోకి వెళ్తున్నాడు అని తెలిసినప్పుడు ఆల్ ది బెస్ట్ కూడా చెప్పానని చెప్పుకొచ్చింది పూజిత.