Vijay Deverakonda- Virat Kohli: ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ సపోర్టు లేకుండా ఇండస్ట్రీ కి వచ్చి తనకంటూ హిట్టు మీద హిట్టు కొడుతూ యూత్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న హీరో విజయ్ దేవరకొండ..పెళ్లి చూపులు అనే సినిమా తో హీరో గా ఇండస్ట్రీ కి పరిచయమైనా విజయ్ దేవరకొండ చూస్తూ ఉండగానే మన కళ్ళముందే అర్జున్ రెడ్డి మరియు గీత గోవిందం వంటి సెన్సషనల్ బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టి స్టార్ హీరో రేంజ్ మార్కెట్ ని ఏర్పాటు చేసుకున్నాడు..ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి యూత్ లో ఎలాంటి క్రేజ్ ఉందంటే కెరీర్ ప్రారంభం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కి యూత్ లో ఎలాంటి ఫాలోయింగ్ ఉండేదో అలాంటి ఫాలోయింగ్ ప్రస్తుతం విజయ్ దేవరకొండ కి ఉంది..ప్రతి ఒక్కరు ఆయన లైగర్ సినిమా తో పాన్ ఇండియా లెవెల్ లో ప్రభంజనం సృష్టించి పాన్ ఇండియా సూపర్ స్టార్ అవుతాడని అనుకున్నారు..కానీ ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఘోరమైన డిజాస్టర్ ఫ్లాప్ గా నిలిచింది.

90 కోట్ల రూపాయిల ప్రీ రిలీజ్ బిజినెస్ ని జరుపుకున్న ఈ చిత్రం కనీసం 30 కోట్ల రూపాయిల షేర్ ని కూడా వసూలు చెయ్యలేకపోయింది..ఇంత పెద్ద ఫ్లాప్ పడిన తర్వాత విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాలపై ఆచి తూచి అడుగులేస్తున్నాడు..అయితే లేటెస్ట్ గా సోషల్ మీడియా లో వినిపిస్తున్న వార్త ఏమిటి అంటే, విజయ్ దేవరకొండ ప్రముఖ ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ బైపీసీ లో నటించబోతున్నాడు అని తెలుస్తుంది..ఒక ప్రముఖ బాలీవుడ్ నిర్మాత ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై పని చెయ్యడానికి సన్నాహాలు చేస్తున్నాడట..ఇటీవలే జరిగిన పాకిస్తాన్ vs ఇండియా క్రికెట్ మ్యాచ్ కి గ్రౌండ్ కి వెళ్లి చూసిన విజయ్ దేవరకొండ, అక్కడ మీడియా ‘MS ధోని గారి బయోపిక్ లో సుశాంత్ సింగ్ రాజ్ పుట్ గారు నటించారు.

మీరు ఒక క్రికెటర్ బయోపిక్ లో నటించాలి అని అనుకుంటే ఎవరి బయోపిక్ లో నటిస్తారు’ అని అడగగా విజయ్ దేవరకొండ దానికి సమాధానం చెప్తూ ‘ఆ ఛాన్స్ వస్తే నేను విరాట్ కోహ్లీ గారి బయోపిక్ లో నటిస్తాను’ అంటూ చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ..యాదృచ్చికంగా విజయ్ దేవరకొండ అలా చెప్పడం..మరియు ఫిలిం నగర్ లో ఈ న్యూస్ రావడం ఇప్పుడు విజయ్ అభిమానులకు సూపర్ కిక్ ని ఇస్తుంది..విజయ్ దేవరకొండ ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ‘ఖుషి’ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు..ఇందులో సమంత హీరోయిన్ గా నటిస్తుంది.