Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ నాలుగో వారం చివరి దశకు చేరుకుంది. టాలీవుడ్ మన్మధుడు ‘కింగ్’ నాగార్జున 19 మంది కంటెస్టెంట్స్ ను బిగ్ బాస్ హౌస్ లో కి సెప్టెంబర్ 5 న పంపాడు. ఆరంభ ఎపిసోడ్ రోజే 18 టీ ఆర్ పి రేటింగ్ సొంతం చేసుకుంది. ఎక్కువ మంది కంటెస్టెంట్స్ ఉండటం వల్ల ప్రతి వారం వారం ఈక్వేషన్స్ మారుతూ వస్తున్నాయి.

మొత్తం 16 మంది కంటెస్టెంట్స్ తో బిగ్ బాస్ నాలుగో వారానికి చేరుకుంది. మొదటి వారానికి గానూ బూతులతో రెచ్చిపోయిన ‘సరయు’ ఎలిమినేట్ అవ్వగా, రెండో వారానికి గానూ కార్తీక దీపం ఫేమ్ ఉమాదేవి ఎలిమినేట్ అయ్యారు. మూడో వారం అందరు అవాక్కయేలా లేడీ అర్జున్ రెడ్డి లహరి ఎలిమినేట్ అయ్యింది.
నాలుగో వారానికి గాను అధికంగా 8 మంది (నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్, లోబో, రవి, ప్రియ, కాజల్, సిరి హన్మంత్, సన్నీ) ఉన్నారు. దీంతో ఈ వారం ఎవరు నామినేట్ అవుతారనే విషయంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ జరుగుతోంది.
ఇక బిగ్ బాస్ అంటేనే ఒక పజిల్ లాంటిది. ఒక్కో వారం గడుస్తుంటే పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ముఖ్యం గా ఎలిమినేషన్స్ అప్పుడు బిగ్ బాస్ హౌస్ లో పరిస్థితులు ఎప్పుడు ఎలా తారుమారు అవుతాయనే విషయాన్ని అంచనా వేయడం కూడా చాలా కష్టంతో కూడుకున్నదే.
సోషల్ మీడియా లో ఫాలోయింగ్ తక్కువ ఉన్న నటరాజ్ మాస్టర్, యానీ మాస్టర్ తప్ప మిగతా కంటెస్టెంట్స్ అందరూ సేఫ్ జోన్లో ఉన్నారని నెట్టింట్లో చర్చ జరుగుతుంది. అయితే ఇప్పటివరకు ఆడవాళ్లనే పంపించారు కాబట్టి ఈసారి మేల్ కంటెస్టెంట్‌ను పంపించేందుకు ఆస్కారం ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు నెటిజన్లు. మొత్తంగా ఈ వారం ఒక కొరియోగ్రాఫర్ బిగ్‌బాస్‌ను వీడి వెళ్లడం ఖాయంగా కనిపిస్తోంది.