Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5 లో రెండు రోజులు జరిగిన రెండవ వారం కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ షో మొత్తానికే హైలైట్ నిలిచింది. గొడవలు, కొట్లాటల మధ్య జరిగిన రెండవ వారం కెప్టెన్సీ టాస్క్ లో టీమ్ ఈగల్ గెలిచింది. ఇదిలా ఉండగా.టీమ్ ఈగల్ కెప్టెన్ అయిన శ్రీరామ చంద్ర టీమ్ లో నుండి నలుగురు సభ్యులని ఎంచుకుని బిగ్ బాస్ కి చెప్పాలి. దీనికి గాను టీమ్ సభ్యులు అయిన విశ్వ, ప్రియ, షన్ను, శ్రీరామ చంద్ర, హమీదా, సిరి, ప్రియాంక సింగ్ చర్చించుకుంటున్నారు. నేను టీమ్ లీడ్ గా ఉన్నా కాబట్టి నేను మీలో ఎవరికైనా ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్న అన్నాడు శ్రీ రామ చంద్ర.
షన్ను కూడా నాకు కెప్టెన్ అవ్వాలని లేదు. పోటీదారునిగా అయితే ఉంటాను అని అన్నాడు.సిరి కాసేపు తట పటాయించి నేను హమీదా కి ఛాన్స్ ఇవ్వాలని అనుకుంటున్న అని హమీదా కి ఛాన్స్ ఇచ్చింది.మొత్తానికి నలుగురు కెప్టెన్ పోటిదారులు అయిన హమీదా, విశ్వ, ఆని మాస్టర్, ప్రియాంకా సింగ్ పేరు లని శ్రీ రామ చంద్ర బిగ్ బాస్ కి తెలియ చేశాడు.బిగ్ బాస్ కొడితే కొట్టాలిరా కొబ్బరికాయ కొట్టాలి అనే టాస్క్ ని ఇచ్చాడు.
దీనికి గాను హౌస్ మేట్స్ చాలా ఉత్సాంగా పాల్గొని వాళ్ల మద్దతును తమ కి ఇష్టం అయిన కంటెస్టెంట్స్ కి తెలిపారు. దీనికి ప్రియా సంచాలకులు గా వ్యవ హరించారు. విశ్వ జార్ లో అధిక మోతాదులో లో కొబ్బరి నీళ్ళు ఉన్నందున బిగ్ బాస్ రెండవ కెప్టెన్ గా “కండల వీరుడు విశ్వ” అయ్యాడు.