https://oktelugu.com/

Bigg Boss 5 Telugu : షణ్ముఖ్‏కు ముద్దుపెట్టిన సిరి… ఆమె బాయ్‏ఫ్రెండ్ రియాక్షన్ ఏంటంటే..

Bigg Boss 5 : టెలివిజన్‏లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. మొదట్లో అంత ఆసక్తికరంగా అనిపించకపోయిన.. వారాలు గడుస్తున్న సమయంలో బిగ్‏బాస్ రసవత్తరంగా మారింది. 19 మందితో మొదలైన షోలో ఇప్పటివరకు సరయూ, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హమిదా, శ్వేత, ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఏడు వారాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వారం ఆసక్తికరంగా సాగుతుంది బిగ్‏బాస్. ఇదిలా ఉంటే.. మొన్నటి ఎపిసోడ్‏లో పలు ఆసక్తికర ఘటనలు […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : October 30, 2021 / 01:09 PM IST
    Follow us on

    Bigg Boss 5 : టెలివిజన్‏లో అతిపెద్ద రియాల్టీ షో బిగ్‏బాస్ సీజన్ 5 విజయవంతంగా దూసుకుపోతుంది. మొదట్లో అంత ఆసక్తికరంగా అనిపించకపోయిన.. వారాలు గడుస్తున్న సమయంలో బిగ్‏బాస్ రసవత్తరంగా మారింది. 19 మందితో మొదలైన షోలో ఇప్పటివరకు సరయూ, ఉమాదేవి, నటరాజ్ మాస్టర్, లహరి, హమిదా, శ్వేత, ప్రియా ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. ఏడు వారాలు పూర్తిచేసుకుని ఎనిమిదవ వారం ఆసక్తికరంగా సాగుతుంది బిగ్‏బాస్. ఇదిలా ఉంటే.. మొన్నటి ఎపిసోడ్‏లో పలు ఆసక్తికర ఘటనలు జరిగాయి. ఒక వైపు సన్నీ, శ్రీరామచంద్ర మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది.

    మానసికంగా డిస్ట్రబ్ అయినప్పుడు ఎమోషనల్‏గా అటాచ్ అయిపోతాం అని షన్నూ అనగా… నీ వల్లే మెంటల్‏గా ఇబ్బంది పడుతున్నా అంటూ చెప్పుకొచ్చింది సిరి. దీంతో చిరాకుగా అనిపిస్తే దూరం పెట్టు అని షన్నూ అనేశాడు. అయితే ఆకస్మాత్తుగా షన్నూకు ముద్దు పెట్టి సైలెంట్‏గా వెళ్లిపోయింది సిరి. దీంతో ఒక్కసారిగా షన్నూ షాకవుతూ.. ఆ తర్వాత వెంటనే ముసి ముసి నవ్వులు నవ్వుతూ జాగ్రత్తగా రికార్డ్ చేశారా ? అంటూ కెమెరాలపై చూస్తూ నాకు ఉంటదిపుడు అంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. అయితే సిరి.. షన్నుకు ముద్దుపెట్టడం ఎంటనీ నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.

    ఇప్పటికే సిరి… శ్రీహాన్‏తో ప్రేమలో ఉందని.. కానీ అన్ని కెమెరాల ముందే షన్నూకు ముద్దుపెట్టడం ఏంటనీ నెట్టింట్లో కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా ఈ విషయంపై సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహాన్ స్పందించాడు. ఇప్పుడేంట్రా నేను ఏడవాలా ? షార్ట్ ఫిల్మ్స్ , సినిమాల్లో చేస్తే ఓకే కదా మీకు అంటూ తన ఇన్‏స్టా స్టోరీలో కామెంట్ చేస్తూ సిరికి మద్దతుగా నిలిచాడు.