Homeఆంధ్రప్రదేశ్‌Badvel by-election: బద్వేలు ఉప ఎన్నిక: జనసేన-టీడీపీ ఓట్లు ఎవరికి పడుతాయి?

Badvel by-election: బద్వేలు ఉప ఎన్నిక: జనసేన-టీడీపీ ఓట్లు ఎవరికి పడుతాయి?

Badvel by-election:  ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటికే పలువురు ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ అధికార వైసీపీతో పాటు బీజేపీ, కాంగ్రెస్ పోటీలో నిలిచాయి. దీంతో త్రిముఖ పోరు నెలకొందని భావిస్తున్నారు. పోటీ నుంచి తప్పుకున్న టీడీపీ, జనసేన ఓట్లు ఎవరికి పడతాయనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది. బీజేపీకి జనసేన మిత్రపక్షం కావడంతో ఆ పార్టీ ఓట్లు బీజేపీకే వేస్తామని పవన్ కల్యాణ్ ప్రకటించిన నేపథ్యంలో టీడీపీ ఓట్లపై కూడా అందరిలో అనుమానాలు నెలకొన్నాయి.
Badvel by-election
అయితే ఇటీవల కాలంలో టీడీపీలో కూడా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ కూడా బీజేపీకి మద్దతు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. టీడీపీ ఓట్లు కూడా బీజేపీకే పడతాయని అంచనా వేస్తున్నారు. దీంతో వైసీపీ, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని చెబుతున్నారు. పవన్ కల్యాణ్ నేరుగా ప్రచారం చేయకపోయినా తమ పార్టీ ఓట్లు బీజేపీకే అని ప్రకటించడంతో పోటీ రెండు పార్టీల మధ్యే ఉంటుందని తెలుస్తోంది.

కాంగ్రెస్ పార్టీ మాత్రం ఏపీలో మరింత చతికిలపడిపోయింది. 2019 ఎన్నికల్లో కనీసం రెండు వేల ఓట్లు కూడా రాని పరిస్థితి. దీంతో ఈ సారి కూడా కాంగ్రెస్ కు ఓట్లు పడవనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో బీజేపీ వైసీపీతో పోటీకి సై అంటోందని సమాచారం. మొత్తానికి బద్వేల్ లో ఓటింగ్ సరళిని అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్ శాతం పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నారు.

దీంతో టీడీపీ ఓట్ల పైనే అందరి దృష్టి పెరుగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీకి అనుకూలంగా టీడీపీ వ్యవహరిస్తుండటంతో వారి ఓట్లు కూడా బీజేపీకే పడతాయనేది నేతల అభిప్రాయం. ఈ నేపథ్యంలో బీజేపీ కూడా ప్రధాన పోటీ ఇవ్వబోతోందని తెలుస్తోంది. టీడీపీ, బీజేపీ, జనసేన ఓట్లతో బలం పెరిగి ప్రత్యర్థికి పోటీగా నిలిచే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయని విశ్లేషకుల అంచనా.

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.

Most Popular

Google Employees Protest: ఉద్యోగుల నిరసన.. సుందర్ పిచాయ్ కి వినతి.. ఏఐ వల్ల గూగుల్ లో ఏం...

Google Employees Protest: గూగుల్.. ప్రముఖ సెర్చ్ ఇంజన్ సంస్థ మాత్రమే కాదు.. టెక్నాలజీ.. వినూత్న ఆవిష్కరణలు.. డేటా.. క్లౌడ్ కంప్యూటింగ్.. ఇలా ఎన్నో విభాగాలలో నెంబర్ వన్ సంస్థ. ఈ సంస్థ...

Sun Facts: ఉదయం నిప్పులు చిమ్మే సూర్యుడు.. రాత్రిపూట ఎక్కడికి వెళ్తాడు..

Sun Facts: ఉదయం సూర్యోదయం అవుతుంది. కాలాలకు అనుగుణంగా సూర్యోదయంలో మార్పులు ఉంటాయి. వేసవికాలంలో అయితే సూర్యుడు తొందరగా ఉదయిస్తుంటాడు. చలికాలం లో అయితే కాస్త ఆలస్యంగా సూర్యోదయం అవుతూ ఉంటుంది. వర్షాకాలంలో...

Samsung Galaxy S26 FE: శామ్‌సంగ్ అభిమానులకు గుడ్‌న్యూస్.. ఈ రెండు త్వరలోనే మార్కెట్లోకి..

Samsung Galaxy S26 FE: ప్రముఖ టెక్ దిగ్గజం Samsung నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వస్తుందంటే చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. అయితే ఆకర్షణీయమైన టాబ్లెట్ లను కూడా తీసుకువచ్చి...

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీ బలప్రదర్శన బలమా వాపా?

ఢిల్లీ వేదికగా జరిగిన కాక్రోచ్ జనతా పార్టీ బలప్రదర్శన దేశ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారితీసింది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రారంభమైన ఈ ఉద్యమం, 23 రోజుల నిరాహార దీక్ష...

Balakrishna Injury: బాలయ్యకు తీవ్ర గాయాలు.. జూనియర్ ఎన్టీఆర్ షాకింగ్ ట్వీట్ వైరల్..

Balakrishna Injury: నేడు కాకినాడ లో నందమూరి బాలకృష్ణ NBK111 షూటింగ్ జరుగుతుండగా , యాక్షన్ సన్నివేశం చిత్రీకరణ సమయంలో బాలయ్య కి మజిల్ టియర్ అవ్వడం తో ఆయన్ని వెంటనే హాస్పిటల్...
Oktelugu Epaper
Exit mobile version