RJ Kajal worst performance: బిగ్ బాస్ ఐదో వారం చివరి దశకు చేరుకుంది. బిగ్ బాస్ 33 ఎపిసోడ్లను పూర్తి చేసుకుంది. మొత్తానికి బిగ్ బాస్ హౌస్ నుండి నలుగురు ఇంటి సభ్యులు ఎలిమినేట్ అవ్వగా 15 ఇంటి సభ్యులు మిగిలి ఉన్నారు. అత్యంత ముఖ్యమైన ఘట్టాలైన నామినేషన్స్, కెప్టెన్ కంటెండర్ల టాస్క్ రెండు గురువారం జరిగిన ఎపిసోడ్ లో ముగిసాయి. తర్వాతి కీలకమైన ఘట్టం.. బెస్ట్, వరస్ట్ పర్ఫార్మర్లను ఎంచుకోవడమే. దానికి సంబందించిన ప్రోమో రాత్రి ప్రసారమైన ఎపిసోడ్ చివరలో వేసాడు.

ఈ నేపథ్యం లో ఇవ్వాళ అంటే శుక్రవారం జరిగే ఎపిసోడ్ లో పెద్ద రచ్చ జరగబోతుందని బిగ్ బాస్ ముందుగానే హింట్ ఇచ్చేసాడు. దీని బట్టి చూస్తే… రేపు కూడా బోలెడంత ఫన్ ఉంటుంది మిస్ కాకుండా చూడండి అని పరోక్షంగా చెప్పకనే చెప్పాడు బిగ్ బాస్. కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ ‘రాజ్యానికి ఒక్కరే రాజు’ టాస్క్ నువ్వా – నేనా అన్నట్టు చాలా రసవత్తరం గా సాగింది. కానీ చివరకి వచ్చేసరికి లోబో ఆట మొత్తాన్ని తయారు మారు చేసాడు. మొదటి నుండి సన్నీ టీం లో ఉంటూ బాగానే సపోర్ట్ చేసాడు. ఆట చివరికి వచ్చేసరికి ప్లేటు ఫిరాయించాడు. దీంతో ఎక్కువ ప్రజలు ఉన్న రాజుగా యాంకర్ రవి నిలిచాడు. అలా అనూహ్య రీతిలో రవి రాజు గా ఎన్నుకోబడ్డాడు.
దాని తర్వాత హౌస్ మేట్స్ అంతా రాజుకి పట్టాభిషేకం చేసాడు.
ఇదిలా ఉండగా… ఎవరు ఊహించని విధంగా బిగ్ బాస్ ఐదో కెప్టెన్ గా ప్రియా నిలిచింది. ఐదో వారానికి సంబందించిన ఒక్క లగ్జరి బడ్జెట్ టాస్క్ మినహాయించి మిగతా అన్ని టాస్క్లు అయ్యిపోయాయి. మిగిలింది వరస్ట్, బెస్ట్ పర్ఫార్మర్లను ఎంచుకోవడమే. ఐదో వారానికి గాను వరస్ట్ పర్ఫార్మర్ గా ఆర్జే కాజల్ నిలిచిందని సమాచారం. ఇవ్వాళా జరిగే ఎపిసోడ్ ఎలాంటి వాగ్వివాదానికి దారి తీసిందో చూడకంటే ఇవ్వాళ ఎపిసోడ్ చూడాల్సిందే.