Bigg boss 5 Telugu: రోజులు గడిచే కొద్ది బిగ్ బాస్ హౌస్ లో కాంపిటీషన్ చాలా టైట్ గా మారుతుంది. బాగా ఆడినా, ఆడకపోయినా.. నవ్వించినా.. నవ్వించకపోయినా.. చిన్న తప్పు చేసినా.. చేయకున్నా సరే కంటెస్టెంట్లు కారణాలు చూపి మరి నామినేట్ చేస్తారు. ప్రతి వారం జరిగే ఈ నామినేషన్స్ ప్రక్రియ ని బిగ్ బాస్ హౌస్ లోని ఉన్న ప్రతి ఒక్క కంటెస్టెంట్ భరించాల్సిందే. ఎప్పుడో ఒకప్పుడు ఎవరొకరు నామినేట్ కావాల్సిందే….. ఆదివారం జరిగే ఎపిసోడ్ లో నాగార్జున చేతుల మీదుగా బిగ్ బాస్ హౌస్ నుంచి తమ హౌస్ వెళ్లి పోవాల్సిందే. . అలా ప్రతి సోమవారం నామినేషన్స్ ప్రక్రియ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతూనే ఉంటుంది.

గేరు మార్చిన బిగ్ బాస్: ప్రతి వారం వారం ఓపెన్ నామినేషన్స్ పెట్టే బిగ్ బాస్ ఈ సారి గేరు మార్చి కన్ఫెషన్ రూమ్ లో నామినేషన్స్ పెట్టాడు. అంతేకాకుండా ఎప్పుడు లేని విధంగా ఒక కొత్త ఫార్ములాని ప్రవేశపెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. నెమ్మది నెమ్మది గా నామినేషన్స్ లో ఉన్న సభ్యుల సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది.
నాలుగో వారానికి గాను ఎనిమిది మంది నామినేట్ కాగా.. ఎన్నడూ లేని విధం గా ఐదో వారానికి బిగ్ బాస్ నుండి బయటకి వెళ్ళడానికి మొత్తం గా తొమ్మిది మంది నామినేట్ అయ్యారు. ఉన్న పదిహేను మంది కంటెస్టెంట్స్ లలో షన్ను, రవి, సన్నీ, ప్రియా, మానస్, జెస్సి, హమీదా , విశ్వ , లోబో….. ఐదో వారానికి గాను ఇంటి నుండి బయటకి వెళ్ళడానికి నామినేట్ అయ్యారు. ఇప్పటికే నలుగురు హౌస్ మేట్స్ బిగ్ బాస్ హౌస్ విడిచి వెళ్లిపోయాయారు.
మొదటి వారం లో సరయు, రెండో వారం లో ఉమాదేవి, మూడో వారం లో లహరి, నాలుగో వారం లో నటరాజ్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యారు ….. మరి ఐదో వారానికి గాను ఎవరు ఎలిమినేట్ అవుతారు అనేది తెలియాలంటే వచ్చే ఆదివారం వరకు ఎదురు చూడాల్సిందే.