Drugs Case: డ్రగ్స్ వ్యవహారం సినీ ఇండస్ట్రీని నిద్రలేకుండా చేస్తోంది. నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత డ్రగ్స్ విచారణ చేపట్టిన పోలీసులు ఒక్కొక్కరిని విచారిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు డ్రగ్స్ వాడుతూ పట్టుబడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ సెలబ్రెటీలను డ్రగ్స్ కేసులో విచారించారు. ఇంకా జరుపుతూనే ఉన్నారు. బాలీవుడ్ లోనే కాకుండా శాండిల్ వుడ్, టాలీవుడ్ లోనూ ఈ ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇదిలా ఉండగా తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో నార్కోట్రిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ) అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు మరో ప్రముఖ వ్యాపార వేత్త కూతురు, మరికొందరని పోలీసులు అరెస్ట్ చేశారు.
డ్రగ్స్ కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సినీ ఇండస్ట్రీ తాజా సంఘటనతో మరోసారి కలకలం రేపింది. ముంబై నుంచి గోవా వెళుతున్న క్యూయిజ్ షిప్ లో రేవ్ పార్టీ జరుగుతున్నట్లు ఎన్సీబీ అధికారులకు సమాచారం అందింది. దీంతో పర్యాటకుల వలే ఎన్సీబీ అధికారులు అదే షిప్ లో ఎక్కి వారిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఇందులో షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ తో పాటు ప్రముఖ వ్యాపార వేత్త కూతురు కూడా ఉన్నారు. అలాగే ఆర్యన్ ఖాన్ స్నేహితుడు నటుడు అర్బాజ్ మర్చంట్, మున్ మున్ దమేచా, నుపూర్ సతీజా, ఇస్మీత్ చద్దా, మోహన్ జైస్వాల్ గోమిత్ చొప్రా, విక్రాంత్ చోకర్ ఉన్నారు.
ముంబై నుంచి గోవాకు బయలుదేరిన షిప్ లో ఎన్సీబీ అధికారులు డ్రగ్స్ వినియోగిస్తున్న వారిని పట్టుకున్నారు. ఈ క్రమంలో వారు 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల చరస్, 22ఎండీఎంఏ పిల్స్, 5 గ్రాముల మెఫెడ్రోన్, 1.3 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆర్యన్ ఖాన్ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభించలేదు. కాగా ఈ షిప్లో 1000 మంది ప్యాసింజర్లు ఉన్నారు. వారిని కూడా విచారిస్తున్నామని ఎన్సీబీ అధికారులు చెబుతున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న తరువాత ఆర్యన్ ఖాన్ కు వైద్య పరీక్షలు నిర్వహించారు. జేజే హాస్పిటల్ కు తీసుకెళ్లి 4 గంటల ప్రాంతంలో పరీక్షలు నిర్వహించారు. ఆర్యన్ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని తేలింది. కానీ మర్చంట్ షూస్ లో కొద్దిపాటి చరస్ దొరికినట్లు తెలిపారు. ఆ తరువాత హాలీడో కోర్టులో హాజరుపరిచారు.
ఆర్యన్ ఖాన్ అరెస్టయిన విషయం తెలియగానే బాలీవుడ్లో కలకలం రేపింది. ఇక ఆయన తండ్రి షారుఖ్ ఖాన్ స్వీడన్ షూటింగ్ లో ఉండగా.. అర్యన్ ఖాన్ అరెస్టు విషయం తెలియగానే హూటాహుటిన ముంబైకి వచ్చాడు. ఆ తరువాత తన కుమారుడి బెయిల్ కు సంబంధించిన పిటిషన్లు, విడుదల గురించి చర్చించారు. ఈ తరుణంలో ఆయన పలువురితో మాట్లాడారు. బాలీవుడ్ కు చెందిన ప్రముఖులు షారుఖ్ ఖాన్ ను పరమర్శిస్తున్నారు. సల్మాన్ ఖాన్ కూడా మున్నత్ లోని షారుఖ్ ఇంటికి వెళ్లారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.
డ్రగ్స్ కేసులో అరెస్టయిన ఆర్యన్ ఖాన్ కు బెయిల్ ఇవ్వాలని ఆయన తరుపున లాయర్ సతీష్ మాన్ షిండే కోర్టును కోరారు. తనకు షిప్ లో టికెట్ లేదని, తన స్నేహితులు పార్టీకి పిలిస్తేనే వెళ్లారని అన్నారు. అతనికి బోర్డింగ్ పాస్ కూడా లేదు. వాట్సాప్ చాటింగ్ ఆధారంగా చేసుకొని అరెస్టు చేశారని సతీష్ కోర్టుకు తెలిపారు. కాగా సతీష్ మాన్ షిండే గతంలో దేశంలోని హై ప్రొఫైల్ కేసులు విచారించిన పెద్ద క్రిమినల్ లాయర్. సుశాంత్ రాజ్ పుత్ కేసులో రియా చక్రవర్తి తరుపున వాదించారు. అంతకుముందు సంజయ్ దత్, సల్మాన్ ఖాన్ కేసులను వాదించాడు. దేశంలోనే పెద్ద క్రిమినల్ లాయర్ గా పేరొందాడు.