https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: ఎలిమినేటైన ప్రియాంక మరలా అలా హౌస్ లో ప్రత్యక్షమైంది

Bigg Boss 5 Telugu: జస్ట్ రెండు వారాల్లో బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉండగా.. ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. హౌస్ లో ఉన్న సిరి, కాజల్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇక షో చివరి దశకు చేరుకోగా… కంటెస్టెంట్స్ కోసం బయట సెలబ్రిటీలు, అభిమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ కి ఓటు వేయాలని కోరుకుంటున్నారు. […]

Written By:
  • Neelambaram
  • , Updated On : December 8, 2021 / 12:58 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: జస్ట్ రెండు వారాల్లో బిగ్ బాస్ 5 టైటిల్ విన్నర్ ఎవరో తేలిపోనుంది. హౌస్ లో ఆరుగురు సభ్యులు ఉండగా.. ఒకరు ఈ వారం ఎలిమినేట్ కానున్నారు. హౌస్ లో ఉన్న సిరి, కాజల్ నుండి ఒకరు ఎలిమినేట్ కానున్నారన్న మాట గట్టిగా వినిపిస్తుంది. ఇక షో చివరి దశకు చేరుకోగా… కంటెస్టెంట్స్ కోసం బయట సెలబ్రిటీలు, అభిమానులు ప్రచారం నిర్వహిస్తున్నారు. తమ అభిమాన కంటెస్టెంట్ కి ఓటు వేయాలని కోరుకుంటున్నారు.

    Bigg Boss 5 Telugu

    టైటిల్ కోసం సన్నీ, షణ్ముఖ్ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సోషల్ మీడియాలో నిర్వహిస్తున్న పోల్స్ ఫలితాల ద్వారా ఈ విషయం అర్థమవుతుంది. బయట స్ట్రాంగ్ ఫ్యాన్ బేస్ ఏర్పాటు చేసుకున్న మానస్, శ్రీరామ్ లను కూడా తక్కువ అంచనా వేయడానికి వీలు లేదు. దీంతో టైటిల్ పోరు మరింత రంజుగా మారింది.

    అయితే 13వ వారం హౌస్ నుండి ఎలిమినేటైన ప్రియాంక సడన్ గా హౌస్ లో ప్రత్యక్షమైంది. అయితే ఆమె నిజమైన పింకీ కాదులెండి. హౌస్ లో ఉన్న సన్నీ, మానస్ ప్రియాంకగా మారిపోయారు. చప్పగా సాగుతున్న బిగ్ బాస్ షోలో మంగళవారం ఎపిసోడ్ లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. హౌస్ మేట్స్ తో బిగ్ బాస్ కొన్ని సరదా ఆటలు ఆడించారు.

    దీనిలో భాగంగా హౌస్ లోకి ఎంటరైనప్పటి నుండీ.. ఎలిమినేట్ అయ్యేవరకూ.. మానస్ తో ప్రియాంక జర్నీని నటించి చూపాలని, కంటెస్టెంట్స్ తమ క్యారెక్టర్స్ మార్చుకోవాలని సూచించారు. ఈ గేమ్ లో సన్నీ ప్రియాంక గెటప్ వేసుకోగా.. కాజల్ మానస్ గెటప్ వేసుకుంది. మానస్ క్యారెక్టర్ చేస్తున్న కాజల్ పదే పదే ప్రియాంక గెటప్ లో ఉన్న సన్నీకి ఐ లవ్ యూ చెప్పడం, మానస్ కి నచ్చలేదు.

    Also Read: Brahmanandam: నవ్వుల రారాజు బ్రహ్మానందంను నవ్వించే వ్యక్తి ఎవరో తెలుసా?

    అసలు ప్రియాంకకు నేను ఐ లవ్ యూ చెప్పలేదంటూ.. కాజల్ పై మండిపడ్డారు. దీంతో హర్ట్ అయిన కాజల్ మానస్ రోల్ చేయనంటూ వెళ్ళిపోయింది. చేసేది లేక మానస్ గెటప్ సన్నీ తీసుకొని ప్రియాంక గెటప్ మానస్ కి ఇవ్వడం జరిగింది. మానస్ గా సన్నీ, ప్రియాంక గా మానస్ యాక్టింగ్ నవ్వులు పంచింది. హౌస్ నుండి ఎలిమినేట్ అయినప్పటికీ మంగళవారం ఎపిసోడ్ మొత్తం ప్రియాంక నామస్మరణతో సాగింది. కాగా ప్రేక్షకులను ఓట్లు స్వయంగా అడిగే ఏర్పాటు కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ కల్పించారు.

    Also Read: Brahmanandam: నవ్వుల రారాజు బ్రహ్మానందంను నవ్వించే వ్యక్తి ఎవరో తెలుసా?

    Tags