https://oktelugu.com/

Katrina Kaif: కత్రినా-విక్కీ పెళ్లి సందడి.. ప్రత్యేకతలివే?

Katrina Kaif: మనదేశంలో కరోనా తర్వాత ఎక్కువగా సందడి చేస్తున్న వార్త ఏదైనా ఉందంటే అది సెలబ్రెటీల వివాహాలే. కరోనాతో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రెటీలు మాత్రం పెళ్లిళ్లతో తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. షూటింగులకు బ్రేక్ దొరకడంతో ఖాళీ సమయాన్ని వాళ్లంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతూ అభిమానులకు షాకులు మీద షాకులిస్తున్నారు. తాజాగా ఈ లిస్టు బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ చేరిపోయింది. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : December 8, 2021 / 01:15 PM IST
    Follow us on

    Katrina Kaif: మనదేశంలో కరోనా తర్వాత ఎక్కువగా సందడి చేస్తున్న వార్త ఏదైనా ఉందంటే అది సెలబ్రెటీల వివాహాలే. కరోనాతో ప్రజలంతా ఇబ్బందులు పడుతుంటే సెలబ్రెటీలు మాత్రం పెళ్లిళ్లతో తెగ సందడి చేస్తున్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కరోనా కారణంగా పరిస్థితులు మారిపోయాయి. షూటింగులకు బ్రేక్ దొరకడంతో ఖాళీ సమయాన్ని వాళ్లంతా సద్వినియోగం చేసుకుంటున్నారు. వరుసగా పెళ్లిపీటలు ఎక్కుతూ అభిమానులకు షాకులు మీద షాకులిస్తున్నారు.

    Katrina Kaif and Vicky Kaushal

    తాజాగా ఈ లిస్టు బాలీవుడ్ ముద్దుగుమ్మ కత్రినా కైఫ్ చేరిపోయింది. ఈ భామ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఆమె తొలి తెలుగు మూవీ ‘మల్లీశ్వరీ’. విక్టరీ వెంకటేష్ కు జోడీగా కత్రినా నటించింది. ఈ మూవీ తెలుగులో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఆ తర్వాత బాలకృష్ణ కలిసి ‘అల్లరి పిడుగు’లో కన్పించింది. అయితే ఆమెకు వరుసగా బాలీవుడ్లో ఆఫర్లు రావడంతో అక్కడే సెటిలైపోయింది.

    బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కత్రినా కైఫ్ నిత్యం డేటింగ్ వార్తలతో వార్తల్లో నిలిచేది. ఈక్రమంలోనే ఆమె పెళ్లివార్తలు నెట్టింట్లో షికార్లు చేశాయి. కొంతకాలంగా ఆమె బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్ తో ప్రేమాయణం కొనసాగిస్తోంది. వీరిద్దరు ప్రేమపక్షుల్లా దేశమంతా తిరుగుతూ సందడి చేశారు.  ఈక్రమంలోనే వీరిద్దరికి పెళ్లికి ఇరువురు కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈక్రమంలోనే డిసెంబర్ 9న కత్రినా-విక్కి కౌశల్ విహహం ఖారారైంది.

    దీంతో కత్రినా ఇంటి పెళ్లి సందడి మొదలైంది. రాజస్థాన్ లోని 14వ శతాబ్దానికి చెందిన సిక్స్ సెన్సెస్ బార్వారా కోటలో వీరి వివాహం డిసెంబర్ 9న అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కోటను రాజస్థాన్ రాజవంశీకులు కట్టించారు. ఈ కోటలో పెళ్లికి సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయింది. కత్రినా-విక్కీల పెళ్లి వేదిక రాంథంబోర్ నేషనల్ పార్క్‌కు 700ల కిలోమీటర్ల దూరంలో ఉంది.

    Also Read: బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ – కత్రీన పెళ్లికి సర్వం సిద్ధం

    కరోనా ఆంక్షల నేపథ్యంలో పెళ్లికి చాలా తక్కువ మందికి ఆహ్వానం పంపినట్లు తెలుస్తోంది. ఆహ్వానాలు అందిన వారంతా కూడా ఇప్పటికే రాజస్థాన్ చేరుకున్నారు. ఈనేపథ్యంలో పెళ్లి ఖర్చుకు సంబంధించిన పలు విషయాలు బయటికి వస్తున్నాయి. సెన్సెన్ బార్వారా కోటలో వధూవరులు చెరో సూట్ ను బుక్ చేసుకోగా దీని ఖర్చు ఒక్క రాత్రికి 7లక్షల రూపాయలని తెలుస్తోంది. ఇందులో ప్రత్యేకంగా స్విమ్మింగ్ పూల్ కూడా విశేషం.

    అతిథుల కోసం ప్రత్యేకంగా హోటళ్లు, విందు, ఇతర ఖర్చులు సైతం భారీగా పెడుతున్నారు. అలాగే పెళ్లిలో కత్రినా కైఫ్ వాడే మోహందీ విలువ అక్షరాల లక్షరూపాయలు. రాజస్థాన్‌లోని పాలీ జిల్లాలోని సోజత్ మెహందీ(హెన్నా)నే ఆమె పెట్టుకోబోతుంది. రసాయనాలు లేకుండా కేవలం చేతితోనే సహజంగా తయారు చేయడం దీని ప్రత్యేకతగా చెబుతున్నారు. అయితే దీనిని ఆ సంస్థ కత్రినాకు ఉచితంగానే అందించిందని టాక్.

    Also Read: కత్రినా కారు ఆపిన ట్రాఫిక్​ పోలీస్​.. నెట్టింట్లో వీడియో వైరల్​