
బిగ్ బాస్ మూడో వారానికి చేరుకుంది. నామినేషన్ల పర్వం ఇప్పటికే ముగిసిపోయింది. మిగిలి ఉన్నది కెప్టెన్సీ కన్టెండర్ టాస్క్. మరి మూడో వారానికి బిగ్ బాస్ హౌస్ మూడవ కెప్టెన్ గా ఎవరు నిలిచారు…? బిగ్ బాస్ హౌస్ లో ఎమోషన్స్ రోజు రోజుకి హద్దులు దాటుతున్నాయి. కట్టెలు తెచ్చుకున్న కోపంతో ఏ మాట పడితే ఆ మాట అనుకుంటు ప్రేక్షకుల దృష్టిలో ఒక రకమైన నెగిటివ్ ఇంపాక్ట్ ని తెచ్చుకుని ఎలిమినేట్ అయ్యే స్థితికి చేరుకుంటున్నారు.
బిగ్ బాస్ లో ఒక్కో వారం గడుస్తుంటే పరిస్థితులు ఎంత కఠినంగా మారిపోతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రోజులు దగ్గర పడుతున్నాయ్ పోటీ పెరిగిపోతుంది. ప్రతి ఒక్కరూ చాలా సీరియస్ గా మనసు పెట్టి ఆడుతున్నారు. మరి ముఖ్యం గా బిగ్ బాస్ 5 లో ప్రతి కంటెస్టెంట్స్ ప్రాణం పెట్టి మరీ టాస్క్ ఆడుతున్నాడు.
నామినేషన్స్ తర్వాత అంత్యంత ముఖ్యమైనది కెప్టెన్సీ టాస్క్. ఈ టాస్క్ లో విజేత అయ్యి కెప్టెన్ గా నిలిస్తే ఇమ్మునిటీ లభిస్తుంది. దాని వల్ల తర్వాత వచ్చే వారానికి నామినేట్ అవ్వకుండా ఉండొచ్చు. అందుకే కంటెస్టెంట్స్ ఎవ్వరూ ఈ కెప్టెన్సీ టాస్క్ ని తేలికగా తీసుకోరు. మూడవ వారానికి గాను బిగ్ బాస్ ఇంటి సభ్యులకి “అమెరికా అబ్బాయి హైదరాబాద్ అమ్మాయి అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. దానిలో భాగంగా శ్రీ రామ చంద్ర అమెరికా అబ్బాయిగా, శ్వేతా వర్మ హైదరాబాద్ అమ్మాయిగా వ్యవహరిస్తారు.
ఈ క్రమంలో బిగ్ బాస్ రవి కి సీక్రెట్ టాస్క్ ఇవ్వడం జరుగుతుంది. ప్రియ వస్తువులను దొంగతనం చెయ్యవలసింది గా బిగ్ బాస్ రవి కి చెప్తాడు. దానిలో భాగంగా రవి ఆ కెప్టెన్సీ సీక్రెట్ టాస్క్ లో గెలుస్తాడు. బెస్ట్ పర్ఫార్మెన్స్ కింద జెస్సీ, శ్రీరామ చంద్ర, శ్వేతా వర్మ, సీక్రెట్ టాస్క్ లో గెలిచిన రవి కెప్టెన్సీ టాస్క్ లో పోటి పడతారు. ఈ తరుణంలో బిగ్ బాస్ మూడవ వారానికి గాను ” జెస్సీ” బిగ్ బాస్ మూడవ కెప్టెన్ గా నిలివగా, రేషన్ మేనేజర్ గా షన్ను ఎంపిక అయ్యాడు.