నేటి టాలీవుడ్ ఎక్స్ క్లూజివ్ అప్ డేట్స్ కి వస్తే.. ‘ఉప్పెన’ సినిమాతో భారీ హిట్ కొట్టిన బుచ్చిబాబు సానా, తన రెండో సినిమాని ఏకంగా మహేష్ బాబుతో ప్లాన్ చేసున్నాడు. మొన్న పార్క్ హైయత్ హోటల్ లో బుచ్చి బాబు సూపర్ స్టార్ మహేశ్ బాబును కలిసి ఓ కథ చెప్పినట్లు తెలుస్తోంది. మహేష్ కి కథ నచ్చింది అట. కాబట్టి.. వీరిద్దరి కలయికలో ఓ సినిమా వచ్చే అవకాశం ఉంది.
మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘గాడ్ ఫాదర్ ’ సినిమా షూటింగ్ ప్రస్తుతం గోవాలో జరుగుతుంది. కాగా నేడు పబ్ లో జరిగే ఒక స్పెషల్ సాంగ్ ను షూట్ చేయబోతున్నారు. ఈ సాంగ్ లో అనసూయ కూడా ఉంటుందని టాక్. ఈ సినిమాలో అనసూయ ఒక ప్రత్యేక పాత్రలో కనిపించబోతుంది.
దివంగత నేత జయలలిత జీవిత కథతో వివాదాల హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ‘తలైవి’ సినిమా రిలీజ్ అయి ఏవరేజ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ చిత్రానికి సీక్వెల్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విజయేంద్ర ప్రసాద్ ప్రస్తుతం ఈ సీక్వెల్ కథ రాస్తున్నాడట. అసలు సినిమాకే నష్టాలు వస్తే.. ఇక మళ్ళీ ఈ కొసరు సీక్వెల్ ఏమిటో !!
నేషనల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ‘ఆదిపురుష్’ షూటింగులో ఫుల్ బిజీగా ఉన్నాడు. అయితే, మరో వారం రోజుల్లో ఈ సినిమా ప్రస్తుత షెడ్యూల్ పూర్తి కానుంది. ముంబైలో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ షెడ్యూల్ లో ప్రభాస్ తో పాటు ఇతర కీలక నటులు కూడా పాల్గొంటున్నారు. ఓం రౌత్ దర్శకత్వంలో ఈ సినిమా రానుంది.
రాజ్‌తరుణ్ కథానాయకుడిగా కషిష్‌ఖాన్ కథానాయికగా శ్రీను గవిరెడ్డి దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘అనుభవించు రాజా. ఈ సినిమాకి సుప్రియ యార్లగడ్డ నిర్మాత. ఇక ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అయింది. అయితే ఈ సినిమా అవుట్ ఫుట్ అసలు బాగాలేదు అని టాక్ నడుస్తోంది. సినిమాలో అసలు మ్యాటర్ లేదట.