
టీ20 వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో ఆడే తన డ్రీం 11 భారత జట్టును మాజీ క్రికెటర్ గౌతం గంభీర్ ప్రకటించాడు. కేఎల్ రాహుల్, రోహిత్ శర్మలను ఓపెనర్లుగా గంభీర్ ఎంచుకోగా మిగతా స్థానాలకు కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, భువనేశ్వర్ కుమార్, వరుణ్ చక్రవర్తి, మహమ్మద్ షమీ, బుమ్రా పేర్లను ప్రకటించాడు. కాగా అక్టోబర్ 24న భారత్, పాకిస్థాన్ మధ్య టీ20 వరల్డ్ కప్ మ్యాచ్ జరగనుంది.