Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో చాలా రోజుల తర్వాత మాటల యుద్ధం జరుగబోతున్నట్లు బిగ్ బాస్ విడుదల చేసిన ప్రోమో ని చూస్తే అర్ధమవుతుంది. ఎప్పుడు నోరు జారని యూట్యూబ్ సెన్సేషన్ షణ్ముఖ్ జస్వంత్ ఒక్కసారిగా ఫైర్ అయ్యాడు. ఇంతలా రెచ్చిపోవడానికి కి కారణం ఎవరో తెలిస్తే షాకవ్వాల్సిందే. ఒక పారు ఇద్దరు దేవదాసుల అన్నట్టుగా… ఇవ్వాళ బిగ్ బాస్ లో జరిగే యుద్ధం కూడా ఒక అమ్మాయి వల్ల ఇద్దరు అబ్బాయిలకి జరగబోతుంది అని ప్రోమో ని చూస్తే అర్ధమవుతుంది.
షన్ను రెచ్చిపోవడానికి కారణమేంటంటే… పదో వారానికి సంబంధించి కెప్టెన్ ఎంచుకోవడానికి కంటెస్టెంట్లకి బీబీ హోటల్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇస్తాడు బిగ్ బాస్.ఇవ్వాళ జరిగే ఎపిసోడ్ లో ఈ టాస్క్ కి సంబంధించిన ఆఖరి అంకం జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే ఈ టాస్క్ లో ముందుగా సిరి, సన్నీ కి మాటల యుద్ధం మొదలవుతుంది. ఈ క్రమం లో నోరు జారిన సన్నీ, సిరి అప్పడం లా నలిపేస్తా అని అంటాడు.
సన్నీ, సిరి ని అప్పడం అన్నందుకు సిరి బెస్ట్ ఫ్రెండ్ అయిన షణ్ముఖ్ జస్వంత్ తన ఫ్రెండ్ కి బాసట గా నిలుస్తాడు. ఈ నేపథ్యం లో సన్నీ, షన్ను కి మాటల యుద్ధం మొదలయింది. ఈ ప్రోమో ని చూసిన ప్రేక్షకులు.. మాకు కావాల్సింది ఇదే కదా అంటూ తమ అభిప్రాయాల్ని తెలుపుతున్నారు. ఉప్పు లేని కూరలా చప్పగా సాగుతున్న బిగ్ బాస్ లో సన్నీ, షన్ను యొక్క వివాదం మంచి మాసాలనే యాడ్ చేసింది. గొడవ ఎంత వరకు సాగుతుంది, ఎంతవరకు సాగుతుంది అనే విషయం తెలుసుకోవాలంటే పూర్తి ఎపిసోడ్ కోసం ఎదురు చూడాల్సిందే.