Kurup: విడుదల రోజే వివాదాల్లో కురుప్​ సినిమా!

Kurup: మలయాళ స్టార్​ హీరో దుల్కర్ సల్మాన్​ నటించిన పాన్​ ఇండియా సినిమా కురుప్​. శుక్రవారం నవంబరు 12న ఈ సినిమా విడుదలైంది. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల రోజే వివాదాల్లో చిక్కుకుంది. కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ఈ సినిమాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పిల్​ ప్రకారం నేరస్థుడైన సుకుమార కురుప్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా వల్ల కురుప్​ గోప్యతను […]

Written By: Raghava Rao Gara, Updated On : November 12, 2021 5:34 pm
Follow us on

Kurup: మలయాళ స్టార్​ హీరో దుల్కర్ సల్మాన్​ నటించిన పాన్​ ఇండియా సినిమా కురుప్​. శుక్రవారం నవంబరు 12న ఈ సినిమా విడుదలైంది. యాక్షన్​ థ్రిల్లర్​ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా విడుదల రోజే వివాదాల్లో చిక్కుకుంది. కేరళలోని కొచ్చికి చెందిన ఓ వ్యక్తి ఈ సినిమాకు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. పిల్​ ప్రకారం నేరస్థుడైన సుకుమార కురుప్​ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అయితే, ఈ సినిమా వల్ల కురుప్​ గోప్యతను ఉల్లంఘించే అవకాశం ఉందని సదరు వ్యక్తి వాదన. ఈ పిల్​పై స్పందించిన కేరళ హైకోర్టు సినిమా సినిమా విడుదలపై ఎలాంటి స్టేను విధించలేదు. కానీ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు, ఇంటర్​పోల్​, చిత్ర నిర్మాతలకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.

వేఫేరర్​ ఫిల్మ్స్​, ఎం స్టార్​ ఎంటర్​టైన్మెంట్​ బ్యానర్​లపై 35 కోట్ల రూపాయల బడ్జెట్​తో ఈ సినిమా రూపొందింది. సినిమాకు శ్రీనాథ్​ రాజేంద్రన్​ దర్శకత్వం వహించారు. దుల్కర్ సల్మాన్​ ఇందులో ప్రధాన పాత్తర పోషించారు. దాదాపు ఆరు నెలల పాటు సాగిన ఈ సినిమా షూటింగ్​.. ఎట్టకేలకు విడుదలైంది.

కేరళ, ముంబయి, దుబాయ్​, మంగళూరు, మైసూర్​, అహ్మదాబాద్​ల్లో 105 రోజుల పాటు ఈ సినిమా తీశారట. గతంలోనే విడుదలవ్వాల్సి ఉండగా.. కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.  శోభిత కథానాయిక. ఇంద్రజిత్‌ సుకుమారన్‌, సన్నీ వేన్‌ కీలక పాత్రలు పోషించారు. సుషిన్​ శ్యామ్​ సంగీతం అందించగా.. నిమిష్​ రవి సినిమాటోగ్రాఫర్​గా వ్యవహరించారు. మలయాళం, తెలుగుతో పాటు, కన్నడ, తమిళం, హిందీ భాషల్లోనూ ఈ సినిమా విడుదలైంది.