https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ షోలో ఊహించని కంటెస్టెంట్ ఎలిమినేషన్.. బూతులు మాట్లాడటంతో?

Bigg Boss 5 Telugu: తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొన్న బిగ్‌బాస్ షో.. ప్రస్తుతం ఐదో సీజన్‌లోనూ ప్రేక్షకులకు మరింత ఎంటరైన్‌మెంట్‌ను ఇచ్చేందుకు రెడీ అయింది. ఇంతకు ముందు రానంతగా ఇప్పుడు వస్తున్న రేటింగ్‌ను చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం.. అప్పుడే అభిమానులకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది. ఆడంబరంగా మొదలైన ఈ షోలో కంటెస్టంట్లు… తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు తెగ ఆసక్తిని […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 12, 2021 / 09:36 AM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: తెలుగులో ఇప్పటికే నాలుగు సీజన్లను విజయవంతంగా పూర్తి చేసుకొన్న బిగ్‌బాస్ షో.. ప్రస్తుతం ఐదో సీజన్‌లోనూ ప్రేక్షకులకు మరింత ఎంటరైన్‌మెంట్‌ను ఇచ్చేందుకు రెడీ అయింది. ఇంతకు ముందు రానంతగా ఇప్పుడు వస్తున్న రేటింగ్‌ను చూసి అందరూ ఆశ్చర్య పోతున్నారంటే అతిశయోక్తి కాదు. ఇప్పటికే వారం రోజులు పూర్తి చేసుకున్న ఈ కార్యక్రమం.. అప్పుడే అభిమానులకు ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

    ఆడంబరంగా మొదలైన ఈ షోలో కంటెస్టంట్లు… తమ టాలెంట్‌ను ప్రదర్శించేందుకు తెగ ఆసక్తిని కనబరుస్తున్నారు. ఇప్పటివరకు జరిగిన ఎపిసోడ్స్‌లో బిగ్‌బాస్‌.. ఇంటి సభ్యులకు కొన్ని టాస్క్‌లు ఇవ్వగా.. వారిమధ్య కొందరిమధ్య గొడవలు.. మరికొందరి మధ్య బాండింగ్ క్రియేట్ అవ్వడం జరిగాయి.

    బిగ్‌బాస్‌ షోలో అత్యంత ముఖ్యమైనది నామినేషన్స్ ప్రక్రియ. ఎంతో ఆసక్తిగా ముందుకు సాగుతున్న ఈ నేపథ్యంలో నామినేషన్స్ టాస్క్‌ మరింత ఉత్కంఠను కలిగించింది. కాగా ఈ వారానికి గానూ యాంకర్ రవి, జస్వంత్ పడాల, ఆర్జే కాజల్, హమీదా, మానస్, సరయులు నామినేట్ అయ్యారు.అయితే ఆరంభంలో యాంకర్ రవి టాప్ ప్లేస్‌లోనే ఉన్నాడట. జస్వంత్‌కు మాత్రం ఆనీ మాస్టర్‌తో గొడవ తర్వాత తన ఓటింగ్ తగ్గిపోయిందని తెలుస్తోంది. అతనొక్కడే కాదు.. మిగతా వాళ్ల ఓటింగ్ సరళిలో కూడా భారీగా మార్పులు వచ్చాయని తెలుస్తోంది. దీంతో ఎలిమినేషన్‌పై ఆసక్తి పెరిగిపోయింది.

    ఈ వారం జరిగిన ఓటింగ్ ప్రాసెస్‌లో యాంకర్ రవికే అందరి కంటే ఎక్కువ ఓట్లు సాధించి టాప్‌లో నిలిచాడట. అతడి తర్వాత స్థానంలో మానస్‌… జస్వంత్‌ ఉన్నట్లు తెలుస్తోంది. అంటే.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్న ముగ్గురు మేల్ కంటెస్టెంట్లు సేఫ్ అయ్యారని టాక్. మిగిలిన ముగ్గురు అమ్మాయిలు ఆర్జే కాజల్, హమీదా, సరయులు డేంజర్ జోన్‌లోనే ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. ప్రైవేటు పోల్స్‌లో కూడా ఇదే విధంగా ఓటింగ్ పొజిషన్స్ ఉన్నట్టు సమాచారం. అన్నింట్లోనూ కాజల్ పరిస్థితి మెరుగ్గానే కనిపిస్తుండడంతో.. హమీదా కానీ, సరయు కానీ ఈ వారం ఎలిమినేషన్ అయ్యే అవకాశం ఉందని సమాచారం.

    బిగ్ బాస్ షో అంటేనే ఊహించని ఎన్నో మలుపులు. మరీ ముఖ్యంగా ఎలిమినేషన్స్‌లో అనుకున్న కంటెస్టెంట్ కాకుండా వేరే వాళ్లు ఎలిమినేట్ అయిన సందర్భాలూ ఉన్నాయి. దీంతో అసలు ఏం జరుగుతుందో అని ప్రేక్షకులంతా నెక్స్ట్ ఎపిసోడ్‌ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.