తిరుపతి రేణిగుంట విమానాశ్రయాన్ని ప్రైవేటీకరించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విమానాల సర్వీసుల సంఖ్య తగ్గిపోవడంతో ప్రైవేటీకరణకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విశాఖపట్నం, విజయవాడ తర్వాత ఎక్కువ మంది ప్రయాణికులు ప్రయాణించే ఎయిర్ పోర్టు రేణికుంట కావడంతో, కేంద్రం నిర్ణయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అలు, ప్రైవేటీకరణ చేయనున్న 13 విమానాశ్రయాల్లో రేణిగుంట కూడా ఉందని కేంద్ర వర్గాలు తెలిపాయి.