Bigg Boss 5 Telugu: సిరిపై జెస్సి అతి ప్రేమ.. పిచ్చి పిచ్చిగా అరిచిన ‘అనీ’ మాస్టర్!

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం నుంచే హౌస్ లో పెద్ద ఎత్తున కొట్లాటలు మొదలవుతున్నాయి. ఇక్కడ ఎవరికి ఎవరు ఏ మాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఏ కంటెస్టెంట్ అయిన వారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వారికి బాగా కౌంటర్ ఇవ్వాలనే వచ్చినట్టు తెలుస్తోంది. వారి గురించి ఏ కంటెస్ట్ అయినా ఒక చిన్నమాటన్న కావలసిగానే దాన్ని పెద్దది చేస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా జెస్సి.. హమీదా […]

Written By: Navya, Updated On : September 9, 2021 1:02 pm
Follow us on

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ 5వ సీజన్ ప్రారంభం నుంచే హౌస్ లో పెద్ద ఎత్తున కొట్లాటలు మొదలవుతున్నాయి. ఇక్కడ ఎవరికి ఎవరు ఏ మాత్రం తీసిపోకుండా ప్రేక్షకులను ఆకర్షించే పనిలో పడ్డారు. ఏ కంటెస్టెంట్ అయిన వారి గురించి తప్పుగా మాట్లాడినప్పుడు వారికి బాగా కౌంటర్ ఇవ్వాలనే వచ్చినట్టు తెలుస్తోంది. వారి గురించి ఏ కంటెస్ట్ అయినా ఒక చిన్నమాటన్న కావలసిగానే దాన్ని పెద్దది చేస్తూ రచ్చ చేస్తున్నారు. తాజాగా జెస్సి.. హమీదా గొడవ పడిన సంగతి మరవకముందే జెస్సీ మరో సారి కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ తో గొడవ పడ్డాడు.

బిగ్ బాస్ హౌస్ లో అందరూ వారి వారి పనులలో నిమగ్నమై ఉండగా జెస్సీ కుర్చీలో కూర్చుని మరొక కాలు అడ్డుగా పెట్టుకుని కూర్చున్నారు. అదే సమయంలో అనీ మాస్టర్ అటువైపుగా వస్తూ కాలు తీయమని అందుకు జెస్సి ఒప్పుకోకపోవడంతో కోప్పడిన అని మాస్టర్ నీది నీ దగ్గర పెట్టుకో నాటకాలు వేయకు అని తిడుతుంది. నీకు వాయిస్ లేస్తే నాకు గొంతు లేవదా అంటూ జెస్సీని తిడుతున్న క్రమంలో అందుకు రియాక్షన్ గా జెస్సీ గట్టిగా చప్పట్లు కొడతాడు. ఈ విధంగా అనీ మాస్టర్ జస్సీ గొడవ తారాస్థాయికి చేరుకుంది.

ఈ క్రమంలోనే అటువైపుగా సిరి రావడంతో సిరి పై అతి ప్రేమ చూపిస్తూ జెస్సి కాలు పక్కకు తీస్తాడు. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవడంతో ఇది చూసిన నెటిజన్లు సోమవారం జరిగిన నామినేషన్ ప్రక్రియలో అనీ మాస్టర్ అంటే తనకు ఎంతో గౌరవం అని చెబుతూ తనని నామినేట్ చేయని జెస్సీ ఈ విధంగా తను వస్తే కాళ్ళు పక్క తీయకపోవడం గమనార్హం. అంటూ కామెంట్ చేస్తున్నారు.అయినా బయట మనం ఎన్ని కామెంట్స్ చేసిన ఈ విషయాలు వారికి తెలియదు కనుక, లోపల ఏం జరుగుతుందనే విషయాన్ని మాత్రమే మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం ఈ ప్రోగ్రాం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.