https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: సిరి షర్టు లోపల చెయ్యి పెట్టిన సన్ని..? హౌస్ లో ఏం జరుగుతుంది..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ మొదటి వారం నుంచి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాస్క్ ల విషయంలో కెప్టెన్సీల విషయంలో కంటెస్టెంట్ ల మధ్య గట్టి పోటీ నెలకొని తీవ్రస్థాయిలో గొడవలు పడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. గత నాలుగు సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో కంటెస్టెంట్ ల మధ్య మొదటి వారాలలోనే గొడవలు రావడంతో ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు. ఇక […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 15, 2021 / 01:35 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళిన కంటెస్టెంట్స్ మొదటి వారం నుంచి ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే టాస్క్ ల విషయంలో కెప్టెన్సీల విషయంలో కంటెస్టెంట్ ల మధ్య గట్టి పోటీ నెలకొని తీవ్రస్థాయిలో గొడవలు పడుతూ రచ్చ రచ్చ చేస్తున్నారు. గత నాలుగు సీజన్లలో ఎప్పుడూ లేని విధంగా ఈ సీజన్లో కంటెస్టెంట్ ల మధ్య మొదటి వారాలలోనే గొడవలు రావడంతో ప్రేక్షకులు కూడా షాక్ అవుతున్నారు.

    ఇక ఈ వారం కెప్టెన్ టాస్క్ లో భాగంగా హౌస్ లోని కంటెస్టెంట్ లు భారీ స్థాయిలో గొడవపడినట్లు తెలుస్తోంది. ఈవారం కెప్టెన్సీ ఎవరనే విషయం కోసం బిగ్ బాస్ పెట్టిన టాస్క్ లో కంటెస్టెంట్ ల మధ్య గొడవలు పెరిగి చివరికి కొట్టుకొనే వరకు వచ్చారు. ఈవారం కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా హౌస్ లోని సభ్యులు రెండు టీమ్స్ గా విడిపోయాయి. ఈ క్రమంలోనే ప్రతి జట్టు ఇతర జట్టు సభ్యుల వద్ద ఉన్నటువంటి డగౌట్స్‌లో ఉన్న పిల్లోస్‌ని తెచ్చుకొని తన డగౌట్స్‌లో పెట్టుకోవాలి. అలాగే ఇతర టీమ్‌లోని పిల్లోస్‌ని దొరకకుండా జాగ్రత్తపడాలి. ఇలా చివరికి ఎవరి దగ్గర అయితే ఎక్కువగా ఉంటాయో వారిని విజేతలుగా పరిగణిస్తున్నట్లు బిగ్ బాస్ టాస్క్ ఇచ్చారు. ఈ విధంగా ఏ టీమ్ అయితే గెలుస్తుందో ఆ టీమ్ నుంచి కెప్టెన్సీని ఎంచుకునే అవకాశం ఉంటుందని తెలియజేయడంతో రెండు జట్ల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్టు ఉంది.

    ఈ టాస్క్ లో భాగంగా పిల్లోస్ లాక్కొనే పనిలో సిరి తన షర్ట్ లోపల పిల్లో దాచుకోవడంతో దానిని తీసుకోవడం కోసం సన్నీ తన షర్ట్ లోపలికి చేయిపెట్టాడంటూ ఆరోపించింది. అయితే ఆమె మాటలను సన్నీ ఖండిస్తూ తాను అలా చేయలేదని ఆరోపించాడు. ఈ క్రమంలోనే అక్కడ జరిగిన సంఘటనను స్లో మోషన్ వీడియోని చూస్తే తన షర్టు లోపలకి చెయ్యి పెట్టలేదని తెలుస్తోంది. అయితే అక్కడికీ సన్నీ శ్వేత అని పిలుస్తున్నప్పటికీ సిరి మాత్రం ఉమెన్ కార్డ్ ఉపయోగించినట్లు విమర్శలు వస్తున్నాయి. ఈ విధంగా పిల్లోస్ కోసం కంటెస్టెంట్ లు ఒకరిపై ఒకరు పడుతూ పోటీ పడ్డారు. ఈ క్రమంలోనే కంటెస్టెంట్ లోబో పై అధిక ఒత్తిడి చేయడంతో లోబో ఒక్కసారిగా కుప్పకూలి కిందపడ్డాడు. లోబో కింద పడేసరికి రవి, విశ్వ మధ్య పెద్దఎత్తున గొడవ జరిగింది. ఆ తర్వాత బిగ్ బాస్ లోబోను మెడికల్ రూమ్ కి పంపి చికిత్స చేయించింది. ఇలా ఈవారం కెప్టెన్సీ టాస్క్ ఎంతో రసవత్తరంగా కొనసాగిందని చెప్పవచ్చు.