https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ లో ఆ తప్పును బయటపెట్టిన షణ్ముఖ్.. పశ్చాత్తాపం

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ముగిసిన ఈ షో ఇంటిల్లిపాదిని అలరించింది. ఈసారి సెలబ్రెటీల్లో యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్ లపై క్రేజ్ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ విజేత కావడం పక్కా అని అంటున్నారు. నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన తొలి షో అందరినీ ఆకర్షించింది. మొత్తం 19 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున పిలిచి హౌస్ లోకి పంపించాడు. ఈ […]

Written By:
  • NARESH
  • , Updated On : September 6, 2021 / 12:45 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ తెలుగు సీజన్ గ్రాండ్ గా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి ముగిసిన ఈ షో ఇంటిల్లిపాదిని అలరించింది. ఈసారి సెలబ్రెటీల్లో యాంకర్ రవి, యూట్యూబర్ షణ్ముఖ్ లపై క్రేజ్ నెలకొంది. వీరిద్దరిలో ఒకరు బిగ్ బాస్ విజేత కావడం పక్కా అని అంటున్నారు. నాగార్జున హోస్ట్ గా ప్రారంభమైన తొలి షో అందరినీ ఆకర్షించింది.

    మొత్తం 19 మంది కంటెస్టెంట్లను హోస్ట్ నాగార్జున పిలిచి హౌస్ లోకి పంపించాడు. ఈ క్రమంలోనే పదో కంటెస్టెంట్ గా పాపులర్ యూట్యూబర్ షణ్ముఖ్ జశ్వంత్ ఎంట్రీ ఇచ్చాడు. రావడంతోనే షణ్ముఖ్ తరచూ ఉపయోగించే ‘అరె ఏంట్రా’ అంటూ నాగార్జున అనడంతో షణ్ముఖ్ సర్ ప్రైజ్ అయ్యాడు.

    సోషల్ మీడియాలో పాపులర్ అయిన షణ్ముక్ ప్రధానంగా కొద్దిరోజుల క్రితం బాగా తాగి మద్యం మత్తులో జూబ్లీహిల్స్ లో చేసిన యాక్సిడెంట్.. డ్రంకెన్ డ్రైవ్ కేసు గురించి ప్రస్తావించాడు. ఆ ఘటనకు చాలా ఫీల్ అవుతున్నానని.. దానినుంచి బయటకు రావాలని ప్రయత్నిస్తున్నానని షణ్ముక్ చెప్పుకొచ్చాడు.

    తన లోని నెగెటివిటిని చూస్తున్నారని.. తనలోని పాజిటివిటీని చూపించి అందరికీ మంచివాడుగా నిరూపించేందుకు వచ్చానని షణ్ముక్ తెలిపాడు. ఈ సందర్భంగా తన డ్రంకెన్ డ్రైవ్ కేసుపై పశ్చాత్తాపం వ్యక్తం చేయడం.. స్టేజీమీదే ఇతడు సారీ చెప్పడంతో ఇతడిపై ప్రేక్షకుల్లో అభిమానం పెరిగింది.