https://oktelugu.com/

Bigg Boss 5 Telugu: అరియానా కుమ్మేసేయ్‌.. సోహైల్‌ క్రేజీ కామెంట్స్ !

Bigg Boss 5 Telugu: బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ( Bigg Boss 5) తో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రతి సీజన్ లాగే ఈ సారి సీజన్ లో కూడా హౌస్‌ లో క్రేజీ సెలబ్రిటీలను తీసుకురాబోతున్నారు. ఐతే, ఎక్కువగా సోషల్‌ మీడియా, బుల్లితెర నుండే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్‌ బాస్‌ కు వ్యాఖ్యాతగా […]

Written By:
  • admin
  • , Updated On : September 5, 2021 / 06:34 PM IST
    Follow us on

    Bigg Boss 5 Telugu: బిగ్‌ బాస్‌ సీజన్‌ 5 ( Bigg Boss 5) తో మళ్ళీ తెలుగు ప్రేక్షకులకు ఫుల్ కిక్ ఇవ్వడానికి సన్నద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ప్రతి సీజన్ లాగే ఈ సారి సీజన్ లో కూడా హౌస్‌ లో క్రేజీ సెలబ్రిటీలను తీసుకురాబోతున్నారు. ఐతే, ఎక్కువగా సోషల్‌ మీడియా, బుల్లితెర నుండే హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఇక నాగార్జున ముచ్చటగా మూడోసారి బిగ్‌ బాస్‌ కు వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు కాబట్టి.. రెగ్యులర్ ఫాలోవర్స్ కి గేమ్ సంగతి ఓ అంచనా ఉంటుంది.

    అయితే, గత సీజన్‌ నుంచి ఓ కంటెస్టెంట్‌ ను సీజన్ 5లో నిర్వాహకులు సెలక్ట్‌ చేశారు. అయితే, ఆమె మరెవరో కాదు బోల్డ్‌ బ్యూటీ అరియానా గ్లోరీ అని ఇప్పటికే సోషల్‌ మీడియాలో ఓ వార్త బాగా వైరల్ అవుతుంది. మరి ఈ విస్తృత ప్రచారంలో నిజం ఎంత అనేది ఇంకా క్లారిటీ రాలేదు. తాజాగా అరియానా అయితే తన ఇన్‌ స్టాగ్రామ్‌ స్టోరీస్‌ లో ఒక వీడియో షేర్‌ చేసింది.

    ఆ వీడియోను బట్టి ఆమె నిజంగానే సీజన్ 5 కి ఎంపిక అయింది అని అర్థమవుతుంది. ఇంతకీ ఆమె పోస్ట్ చేసిన వీడియోలో ఏముంది అంటే.. అరియనా మాటల్లోనే.. ‘అందరికీ నమస్కారం. బిగ్‌ బాస్‌ సీజన్ 4 జర్నీకి అప్పుడే ఏడాది పూర్తి అయిపోయింది. నా కోసం సమయం కేటాయించి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్.

    ఇక నేను రేపు మీరందరికీ ఒక ఎగ్జైటింగ్ న్యూస్ ను చెప్పబోతున్నాను, మరి అప్పటివరకు వెయిట్‌ చేయండి’ అని చిన్న సిగ్గుతో ఒయ్యారాలు పోతూ అరియనా చెప్పుకొచ్చింది. అయితే, మరో వీడియోలో సోహైల్‌ మాట్లాడుతూ.. ‘అరియానా రేపు టీవీలో రానుంది. అది చాలా స్పెషల్‌ అన్నమాట.

    ఇక రేపటి నుంచి కథ వేరే ఉంటది. ఆల్‌ ద బెస్ట్‌ అరియానా, నిన్ను చూస్తే గర్వంగా ఉంది. కుమ్మేసేయ్‌. ఆమె కోసం వెయిట్‌ చేయండి’ అని సోహైల్‌ మాట్లాడాడు. మొత్తానికి ఆమె బిగ్ బాస్ సీజన్ 5లో ఎంట్రీ ఇవ్వబోతుంది.