https://oktelugu.com/

‘అభిజిత్’ని ఆఫర్లతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న దర్శక నిర్మాతలు ?

బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ కావడంతో రెండు రాష్ట్రాలలోనూ “అభి” ట్రేండింగ్ లో ఉన్నాడు. ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించి మరియు అభిజిత్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. తన క్యారెక్టర్ తో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాతో హీరోగా పరిచయమయ్యాక, మిర్చిలాంటి కుర్రోడు, అరెరే లాంటి సినిమాలు చేసినా విజయం వరించలేదు. హీరోగా […]

Written By:
  • admin
  • , Updated On : December 22, 2020 / 03:11 PM IST
    Follow us on


    బిగ్ బాస్ తెలుగు సీజన్ 4 విన్నర్ కావడంతో రెండు రాష్ట్రాలలోనూ “అభి” ట్రేండింగ్ లో ఉన్నాడు. ఎక్కడ చూసినా బిగ్ బాస్ గురించి మరియు అభిజిత్ గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. తన క్యారెక్టర్ తో కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్నాడు అభిజీత్. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఎనిమిదేళ్ల క్రితం వచ్చిన ” లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్” సినిమాతో హీరోగా పరిచయమయ్యాక, మిర్చిలాంటి కుర్రోడు, అరెరే లాంటి సినిమాలు చేసినా విజయం వరించలేదు. హీరోగా అవకాశాలు లేక ‘పెళ్లిగోల’ వెబ్ సిరీస్ లో నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. ఇలాంటి టైంలో ఒక సూపర్ ఆఫర్ అభి చెంతకి చేరింది. అదే బిగ్ బాస్ తెలుగు సీజన్ 4.

    Also Read: చిరుకు దోశ ఛాలెంజ్ విసిరిన చిలిపి సమంత

    వెండితెర మీద పెద్దగా సక్సెస్ కాలేకపోయినా అభిజిత్ ‘బిగ్ బాస్’షో ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. మిస్టర్ కూల్ గా పేరు తెచ్చుకున్న అభిజిత్ కు బిగ్ బాస్ షో తర్వాత సినిమా, వెబ్ సిరీస్ ఆఫర్లు వస్తున్నాయని సమాచారం. తన పాత్రకు ప్రాధాన్యత కలిగి , గుర్తింపు తెచ్చిపెట్టే ఆఫర్లకు మాత్రమే అభిజిత్ గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారని సమాచారం. ఇలాంటి సమయాలలోనే ఆచి తూచి అడుగులు వేయాలి, అవకాశాలని కరెక్ట్ గా ఉపయోగించుకుంటే మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవలసిన పరిస్థితి రాకుండా లైఫ్ ని సెట్ చేసుకోవచ్చు.

    Also Read: పవన్ డైరెక్టర్ కు త్రివిక్రమ్ వార్నింగ్!

    బిగ్ బాస్ లో ఇంతటి క్రేజ్ తెచ్చుకుని కోట్ల సంఖ్యలో అభిమానులను సొంతం చేసుకున్న అభిజీత్ కోసం దర్శక నిర్మాతలు సైతం ఆసక్తి చూపుతున్నారట. ఇప్పటికే రెండు సినిమాలు, పదుల సంఖ్యలో వెబ్ సిరీస్ ల ఆఫర్లు అభిజిత్ కు వచ్చాయని తెలుస్తోంది. తమ కంపెనీలకు అభిజిత్ ను బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించాలని కోరుతున్నారని, మాల్స్ ఓపెనింగ్ కు అభిజిత్ కు ఆహ్వానాలు అందుతున్నాయని సమాచారం.ఈ రేంజ్ లో ఆఫర్లు రావటం చూసి ఒకింత షాక్ కి అదే సమయంలో ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బయిపోతున్నాడట. మరోవైపు అభిజిత్ ఇంటర్వ్యూల్లో మాట్లాడుతూ బిగ్ బాస్ 4 విన్నర్ అవుతానని ఊహించలేదని, చాలా చాలా సంతోషంగా ఉందని చెప్తున్నారు.అభిమానులకి ధన్యవాదాలు తెలుపుతూ వారి అంచనాలని వృధా చేయనని చెప్పాడు. ఈ అవకాశాలని అభిజీత్ ఎలా వినియోంచుకుంటాడో చూద్దాం.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్