https://oktelugu.com/

బిగ్ బాస్ 4 : ఈ సారి వారిదే డామినేషన్

బుల్లి తెర రియాలిటీ షోలలో ఎన్ని షోలు ఉన్నా బిగ్ బాస్ షో క్రేజ్ వేరనే చెప్పాలి. మనకు తెలిసిన సెలబ్రిటీలు నిజజీవితంలో ఎలా ఉంటారనే ఆసక్తే అభిమానుల్లో ఈ షో పట్ల క్రేజ్ పెంచుతోంది. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే సీజన్ 4లో లేడీస్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మూడు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లే టైటిల్ విన్ కాగా ఈ సీజన్ లో మాత్రం ఫిమేల్ కంటెస్టెంట్ టైటిల్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. […]

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : September 7, 2020 / 09:15 PM IST

    Bigg Boss 4: This time their domination

    Follow us on


    బుల్లి తెర రియాలిటీ షోలలో ఎన్ని షోలు ఉన్నా బిగ్ బాస్ షో క్రేజ్ వేరనే చెప్పాలి. మనకు తెలిసిన సెలబ్రిటీలు నిజజీవితంలో ఎలా ఉంటారనే ఆసక్తే అభిమానుల్లో ఈ షో పట్ల క్రేజ్ పెంచుతోంది. అయితే మిగతా సీజన్లతో పోలిస్తే సీజన్ 4లో లేడీస్ డామినేషన్ ఎక్కువగా కనిపిస్తోంది. మూడు సీజన్లలో మేల్ కంటెస్టెంట్లే టైటిల్ విన్ కాగా ఈ సీజన్ లో మాత్రం ఫిమేల్ కంటెస్టెంట్ టైటిల్ విన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

    Also Read : టీవీ9 దేవి గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

    మిగతాగా వాళ్లతో పోలిస్తే ఈ సీజన్ లో గంగవ్వ ప్రత్యేకం. 57 ఏళ్ల గంగవ్వ టాస్కుల్లో ఎలా పాల్గొంటుందో మిగతా కంటెస్టెంట్లకు టఫ్ కాంపీటీషన్ ఏ విధంగా ఇస్తుందో చూడాల్సి ఉంది. ఎప్పుడూ చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ కనిపించే అల్లరి లాస్య చీమ ఏనుగు జోక్ లతో వీక్షకులకు కావాల్సినంత వినోదాన్ని పంచుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇక శృతి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. శృతి అంటే సులభంగా గుర్తు పట్టలేమెమో కానీ జోర్దార్ సుజాత అంటే సులభంగా అర్థమవుతుంది.

    తెలంగాణ యాసలో అవలీలగా అద్భుతంగా మాట్లాడే ప్రతిభ సుజాత సొంతం. ఇక రెబల్ గా కనిపించే దేవి నాగవల్లి హౌస్ లో ఎలా ఉండబోతుందో చూడాల్సి ఉంది. యూట్యూబ్ లో లక్షల్లో సబ్ స్క్రైబర్లు ఉన్న దేత్తడి హారికకు ఉన్న ఫాలోయింగ్ తక్కువేం కాదు. బోల్డ్ అంటూ ఎంట్రీ ఇచ్చిన అరియానా గ్లోరీ ఎంత బోల్డో ఏ విషయంలో బోల్డో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే. బోలెడన్ని వివాదాలతో పాపులర్ అయిన కరాటే కళ్యాణి పంచే వినోదం తక్కువేం కాదు.

    చిన్నాచితకా పాత్రల్లో నటించిన దివి కోరుకున్న విధంగా సెలబ్రిటీ స్టేటస్ అందుకుంటుందో కొన్ని వారాలకే బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వెళుతుందో చూడాల్సి ఉంది. ఇక హౌస్ లో మిగతా వాళ్లతో పోలిస్తే మోనాల్ గజ్జర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. మిగతా వాళ్లతో పోల్చి చూస్తే క్రేజ్ పరంగా, ఫాలోయింగ్ పరంగా మోనాల్ ముందంజలో ఉంది. సీజన్ 4 టైటిల్ రేసులో మోనాల్ తప్పక ఉంటుందని విశ్లేషకులు అంచనా వేస్తుండగా సోషల్ మీడియా సర్వేల్లోనూ ఇదే విషయం ప్రూవ్ అవుతోంది.

    Also Read : ఫ్లాష్: సినీ నటుడు జయప్రకాష్ రెడ్డి కన్నుమూత