Also Read: అల్లు అర్జున్ పై పోలీసులకు ఫిర్యాదు
బిగ్ బాస్ తొలి సీజన్ నుంచి కంట్రవర్సీలతోనే షోపై హైప్ క్రియేట్ చేయడం ఆనవాయితీగా వస్తోంది. కంటెస్టుల మధ్య గొడవలు పెట్టేలా టాస్కులు పెట్టి దానిని హైప్ చేస్తూ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతుంటారు. ఇందులో భాగంగానే కంటెస్టుల మధ్య ప్రేమాయణం లాంటివి చూపిస్తూ ఆడియెన్స్ లో ఉచ్చుకత పెంచుతుండేవారు. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4లో ట్రయాంగిల్ లవ్ స్టోరీతో ఆడియన్స్ ను కట్టిపడే ప్రయత్నం చేస్తున్నట్లు కన్పిస్తోంది.
హీరోయిన్ మొనాల్.. అభిజిత్.. అఖిల్ మధ్య ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తోందని బిగ్ బాస్ చూసే ప్రేక్షకులకు ఇట్టే అర్థమవుతోంది. ఈ వారం మెయిన్ గా వారిని బిగ్ బాస్ ఎక్కువగా ఫోకస్ చేసినట్లు కన్పిస్తోంది. దీనిపై కొందరు మాత్రం నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ షో పులిహోరను కలుపడంతోనే సరిపోతుందని ఎద్దేవా చేస్తున్నారు. ఎన్నిరోజులు ఆ పులిహోర లవ్ స్టోరీని చూడాలని కామెంట్ చేస్తున్నారు. మొనాల్ కోసం అభిజిత్..అఖిల్ తన్నుకునేలా ఉన్నారంటూ నవ్వుకుంటున్నారు.
ఇక బుధవారం టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ చూస్తే ఇది రియల్టీ షోలా కాకుండా కామెడీషో గామారిందంటున్నారు. దెత్తడి హారిక, మెహబూబాలు డాన్స్ ఇరగదీశారు. డాన్స్ మాస్టర్ అమ్మ రాజశేఖర్ సోలో డాన్స్ ఆకట్టుకుంది. మొనాల్ హాట్ ఫార్మమెన్స్ తో అదరగట్టింది. అయితే అంతకముందు రోజు కామెడీ షోలతో అలరించిన కంటెస్టులు ఆ వెంటనే డ్యాన్సులతో అలరించారు.
Also Read: పెళ్లి అయ్యాక కూడా హీరో గ్యాప్ ఇవ్వట్లేదు !
అయితే ఇది రియల్టీ షో అన్నట్లు కాకుండా కామెడీ.. డాన్సు షోగా మారిందనే కామెంట్లు విన్పిస్తుంది. ఇక త్వరలోనే ఐపీఎల్ వస్తుండటంతో ఈ షో ఇలానే కొనసాగితే సీరియల్స్ కు వచ్చే రేటింగ్ కూడా రాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా బిగ్ బాస్ కంటెస్టులకు ఇచ్చే టాస్కుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాడో లేదో వేచి చూడాల్సిందే..!