https://oktelugu.com/

బిగ్ బాస్-4: నోయల్ పరిస్థితి విషమం.. విషాదంలో కంటెస్టెంట్లు..!

బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో ఎనిమిది వారాలకు పైగా కొనసాగుతోంది. పలువురు కంటెస్టెంట్లు ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోగా గేమ్ రోజు రోజుకు మరింత రసవత్తరంగా సాగుతోంది. అయితే ఉన్నట్టుండి బిగ్ బాస్-4లో అనుహ్య పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ కొన్నివారాల క్రితమే గంగవ్వ బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయింది. వయస్సు రీత్య ఆమె ఆరోగ్యం సరిగా […]

Written By:
  • NARESH
  • , Updated On : October 30, 2020 / 10:22 AM IST
    Follow us on

    బిగ్ బాస్ నాలుగో సీజన్ బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇప్పటికే బిగ్ బాస్ షో ఎనిమిది వారాలకు పైగా కొనసాగుతోంది. పలువురు కంటెస్టెంట్లు ఇప్పటికే హౌస్ నుంచి వెళ్లిపోగా గేమ్ రోజు రోజుకు మరింత రసవత్తరంగా సాగుతోంది. అయితే ఉన్నట్టుండి బిగ్ బాస్-4లో అనుహ్య పరిణామం చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    కొన్నివారాల క్రితమే గంగవ్వ బిగ్ బాస్ నుంచి వెళ్లిపోయింది. వయస్సు రీత్య ఆమె ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వైద్యుల పరీక్షలు నిర్వహించి అనంతరం హౌస్ నుంచి పంపించారు. తాజాగా నోయల్ సీన్ కూడా అనారోగ్యం బారినపడ్డారు. అతడికి వైద్య సేవలు అందించిన ఆరోగ్యం కుదటపడలేదు. దీంతో మెరుగైన వైద్యం కోసం అతడిని హౌస్ నుంచి బయటికి పంపించాడు.

    Also Read: బిగ్ బాస్-4: ఈవారం హౌస్ నుంచి వెళ్లేది మాస్టారేనా?

    రెండ్రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న నోయల్ సీన్ లగ్జరీ బడ్జెట్ టాస్క్ సందర్భంగా అతడి ఆరోగ్యం మరింత విషమించింది. దీంతో అతడు టాస్క్ ఆడకుండానే రెస్ట్ తీసుకున్నాడు. మిగతా కంటెస్టులు అతడి ఆరోగ్యపరంగా సలహాలు సూచనలు ఇచ్చారు. ఇంకో ఏడువారాలు హౌస్ లోనే కొనసాగాలని ఆరోగ్యం కాపాడుకోవాలని సూచించారు.

    నోయల్ సీన్ తన టాస్కును అభిజిత్ కు అప్పగించి రెస్టు తీసుకున్నాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూంలోకి నోయల్ ను పిలిచి మాట్లాడారు. మెరుగైన వైద్యం కోసం మీరు బయటికి వెళ్లాల్సి ఉంటుందని సూచించారు. దీంతో నోయల్ కన్ఫెషన్ రూమ్ నుంచి విచారకంగా బయటకు వచ్చాడు. ఇక చేసేదిలేక కంటెస్టులంతా అతడిని విషాదంలోనే బయటికి పంపించారు.

    Also Read: పెళ్లికి రెడీ అయిన యాంకర్ రష్మి.. ఏమందంటే?

    అయితే కంటెస్టులంతా బిగ్ బాస్ హౌస్ లో అనారోగ్యం బారిన పడుతుండటం చర్చగా మారుతోంది. అసలు బిగ్ బాస్ హౌస్ కంటెస్టులు ఎందుకు అనారోగ్యం బారిన పడుతున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి. అన్ని జాగ్రత్తలు తీసుకొని గేమ్ ను ప్రారంభించినా కంటెస్టులు అనారోగ్యం బారిన పడుతుండటంపై అభిమానులు పలు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గంగవ్వ.. నోయల్ సీన్ అనారోగ్యంతో బయటికి వెళ్లగా మరేవరైనా ఇంకా అనారోగ్యంతో బయటికి వస్తారా? అనేది ప్రశ్నగా మారింది.