కరోనా నేపథ్యంలో మూతబడ్డ విద్యాసంస్థలు ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 2 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అయితే కరోనా వ్యాప్తి ఇంకా తగ్గనందున సరైన మార్గదర్శకాలతో పాఠశాలలు, కాలేజీలను ప్రారంభించాలని చూస్తోంది. ఇందులో భాగంగా తాజాగా కొత్త షెడ్యూల్‌ను ప్రకటించింది. ఆ షెడ్యూల్ ప్రకారమే విద్యాసంస్థలు తెరవాలని అందులో పేర్కొన్న విధంగా నిబంధనలు పాటించాలని సూచించింది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
నవంబర్ 2 నుంచి ప్రారంభమయ్యే విద్యాసంస్థల్లో ముందుగా ఉన్నతశ్రేణి విద్య తరగతులు మొదలు పెట్టనున్నారు. నవంబర్ 2 నుంచి పాఠశాలస్థాయిలో 9, 10 తరగతులు, ఇంటర్ విద్యార్థులకు రోజువిడిచి రోజు ఒంటిపూట తెరవనున్నారు. ఇక డిగ్రీ, ఇంజినీరింగ్ మొదటి సంవత్సరం మినహా మిగతా విద్యార్థులకు ఈరోజునే ప్రారంభం అవుతాయి. కాగా కొన్ని విద్యాసంస్థలు ఆన్‌లైన్ పద్దతిలో కూడా తరగతులు నిర్వహించుకోవచ్చని ప్రభుత్వం సూచించింది.
Also Read: పోలవరం ఇంకో ‘ప్రత్యేక హోదా’ లాగా మారబోతుందా?
నవంబర్ 23 నుంచి 6,7,8 తరగతుల బోధన ప్రారంభం అవుతుంది. వీరికి సైతం ఒంటిపూట బడులే నిర్వహిస్తారు. చివరగా 14వ తేదీ నుంచి 1 నుంచి 5వ తరగతులు ప్రారంభం కానున్నట్లు విద్యాశాఖ తెలిపింది. పాఠ్యాంశాలను విద్యాశాఖ మూడు విభాగాలుగా విభించి బోధిస్తారు. ఎక్కువ శాతం ఇంటి వద్ద చదువుకునేందుకు వీలు కల్పిస్తారు. కొన్ని పాఠ్యాంశాలను వాట్సాప్ లేదా ఇతర పద్దతులుల్లో చెబుతారు.
Also Read: జగన్.. మౌనమేలనోయి..!
కళాశాల విద్యాసంస్థల్లో అత్యవసరం కానివి ఆన్‌లైన్ పద్దతుల్లో నిర్వహించుకోవచ్చని సూచించింది. విద్యార్థుల్లో మూడోవంతు చొప్పును విడతల వారీగా పది రోజుల పాటు తరగతుల్లో పాఠాలు బోధిస్తారు. ఆ తరువాత మొదటి బ్యాచ్‌కు ఆన్‌లైన్ పాఠాలుంటాయి. మరో బ్యాచ్ విద్యార్థులు క్లాసులకు హాజరవుతారు. మొత్తం ఒక సెమిస్టర్ సంబంధించిన 90 రోజుల్లో 30 రోజుల పాటు తరగతులు ఉంటాయి. హాస్టళ్లలో ఉండేవారికి కూడా ఇదే విధానాన్ని కొనసాగించే అవకాశం ఉంది.