https://oktelugu.com/

బిగ్ బాస్-4: కంటెస్టెంట్ల పారితోషికాలు లీక్.. అత్యధికంగా ఎవరికంటే?

తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో బిగ్ బాస్ అభిమానులు తొలినాళ్లలో కొంత నిరుత్సాహం చెందారు. అయితే ఆ తర్వాత క్రమంగా షో పుంజుకుంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది. మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్ ‘బిగ్ బాస్’లో పాల్గొనే కంటెస్టెంట్లకు భారీ పారితోషికాలు అందుతాయనే టాక్ ఉంది. ప్రస్తుత సీజన్లలో స్టార్లు లేకపోయినప్పటికీ […]

Written By:
  • NARESH
  • , Updated On : November 7, 2020 / 01:39 PM IST
    Follow us on

    Tearful tales of ‘Bigg Boss 4’ contestants

    తెలుగు రియల్టీ షోలలో బిగ్ బాస్ నెంబర్ వన్ గా కొనసాగుతోంది. గత సీజన్లకు భిన్నంగా బిగ్ బాస్-4 కొనసాగుతోంది. ప్రస్తుత సీజన్లలో పెద్దగా సెలబ్రెటీలు లేకపోవడంతో బిగ్ బాస్ అభిమానులు తొలినాళ్లలో కొంత నిరుత్సాహం చెందారు. అయితే ఆ తర్వాత క్రమంగా షో పుంజుకుంటూ బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోంది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

    ‘బిగ్ బాస్’లో పాల్గొనే కంటెస్టెంట్లకు భారీ పారితోషికాలు అందుతాయనే టాక్ ఉంది. ప్రస్తుత సీజన్లలో స్టార్లు లేకపోయినప్పటికీ కంటెస్టెంట్లకు భారీగానే పారితోషికాలు అందుతున్నట్లు తెలుస్తోంది. తాజాగా బిగ్ బాస్-4 కంటెస్టెంట్ల పారితోషికాలు అనధికారికంగా లీక్ అయ్యాయి. దీంతో ఎవరెవరికీ ఎంత పారితోషికం అందుతుందనేది తెలుసుకునేందుకు బిగ్ బాస్ ప్రేక్షకులు ఆసక్తి చూపుతున్నారు.

    Also Read: బిగ్ బాస్-4:రింగులో రంగు.. హరికకు ఎక్కడపడితే అక్కడ రంగుపూసిన మాస్టర్..!

    బిగ్‌బాస్-4లో ఇప్పటివరకు దాదాపు 19 మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. వీరిలో వైల్డ్ కార్డు ఎంట్రీగా వచ్చిన స్వాతి దీక్షిత్.. కుమార్ సాయికి వారానికి 2లక్షలు.. ఎలిమినేటైన సుజాత 2లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అఖిల్, ఎలిమినేటైన దివి వద్యాకు.. అవినాష్‌.. సోహైల్.. మెహబూబ్, అరియానా గ్లోరికి వారానికి 2.50లక్షల చొప్పున చెల్లిస్తున్నట్టు తెల్సింది.

    Also Read: దక్షిణాదివారి ధ్యాసంతా దానిగురించే.. మంటపుట్టించిన పూజాహెగ్డే మాటలు..!

    బిగ్ బాస్-4 నుంచి ఎలిమినేటైన కరాటే కళ్యాణి.. దేవి నాగవల్లి.. గంగవ్వ.. సూర్య కిరణ్‌లకు వారానికి 3లక్షలు చెల్లించినట్టు సమాచారం. దెత్తడి హారిక.. అమ్మా రాజశేఖర్.. అభిజిత్‌లకు వారానికి రూ.3 లక్షల చొప్పున చెల్లించిస్తున్నారట. అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటున్న వారిలో యాంకర్ లాస్య.. నోయల్ సీన్‌లకు రూ.7లక్షలు.. మోనాల్ గజ్జర్‌కు వారానికి రూ.11లక్షల రూపాయల అదిరిపోయే పారితోషికం చెల్లిస్తున్నారని సమాచారం.