Bigg Boss 4 Abhijeet: తెలుగు బుల్లితెర పై బిగ్ బాస్ రియాలిటీ షో ఎంత పెద్ద గ్రాండ్ సక్సెస్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు..సీరియల్స్ ద్వారా మరియు సినిమాల ద్వారా కూడా దక్కని క్రేజ్ మరియు పాపులారిటీ ని కేవలం ఈ షో ద్వారానే రప్పించుకుంటారు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్..వయస్సు తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఈ రియాలిటీ షో కోసం టీవీలకు అతుక్కుపొయ్యి చూస్తుంటారు..అందుకే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా ప్రతి ఏడాది సరికొత్త హంగులతో ప్రేక్షకులను అలరించే టాస్కులతో మన ముందు ఉంటారు..ఇక బిగ్ బాస్ సీసన్ 4 ఇప్పటి వరుకు ప్రసారమైన అన్ని సీసన్స్ కంటే భారీ హిట్ అని చెప్పొచ్చు..ఇక ఈ షో లో పాల్గొన్న అభిజీత్ టైటిల్ విన్నర్ గా గెలిచినా సంగతి మన అందరికి తెలిసిందే..ఈయన శేఖర్ ఖమ్ముల దర్శకత్వం లో తెరకెక్కిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా ద్వారా ఇండస్ట్రీ కి హీరో గా పరిచయం అయ్యాడు..ఈ సినిమా ద్వారానే ఇప్పుడు క్రేజీ హీరోలుగా కొనసాగుతున్న విజయ్ దేవరకొండ మరియు నవీన్ పోలిశెట్టి వంటి వారు కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్స్ గా పరిచయం అయ్యారు.
బాక్స్ ఆఫీస్ వద్ద పర్వాలేదు అనే రేంజ్ లో ఆడిన ఈ సినిమా హీరో గా చేసిన అభిజీత్ కి పెద్ద గుర్తింపు తీసుకొని రాలేదు కానీ, విజయ్ దేవరకొండ మరియు నవీన్ పోలిశెట్టి వంటి వారికి ఈ మాత్రం ఈ సినిమా బాగా ఉపయోగపడింది..ఈ సినిమా తర్వాత అడపాదడపా కొన్ని సినిమాల్లో హీరో గా నటించిన అభిజీత్ కి కావాల్సినంత గుర్తింపు అయితే రాలేదు..కానీ రాక రాక వచ్చిన వరల్డ్ బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ అవకాశాన్ని సరిగ్గా ఉపయోగించుకొని ఒక రేంజ్ క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు..ఈ షో నుండి బయటకి వచ్చిన తర్వాత అభిజీత్ రేంజ్ మారిపోతుంది..ఇక వరుస సినిమాలతో బాక్స్ ఆఫీస్ ని దున్నేస్తాడు అని అందరూ అనుకున్నారు..షో నుండి బయటకి వచ్చిన తర్వాత అభిజీత్ కూడా ఇదే మాట అన్నాడు..కొంతమంది టాప్ డైరెక్టర్స్ నాతో సినిమాలు చెయ్యడానికి ముందుకు వచ్చారని..త్వరలోనే ఆ సినిమాల షూటింగ్స్ ప్రారంభం కానున్నాయని పలు ఇంటర్వూస్ లో తెలిపాడు..కానీ ఆ సినిమాల జాడ ఏంటో ఇప్పటి వరుకు ఎవరికీ తెలీదు..అయితే ఆరోగ్య సమస్యల వల్లే అభిజీత్ సినిమాల్లో నటించడం లేదని తెలుస్తుంది..బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు కూడా అభిజీత్ చాలా అనారోగ్య సమస్యలకు గురైయ్యాడు..అయినా కూడా తన తెలివితేటలతో అద్భుతంగా ఆడి శబాష్ అనిపించుకున్నాడు..అయితే ఇప్పుడు చాలా కాలం తర్వాత ఆయన అమెజాన్ ప్రైమ్ సంస్థ నిర్మించిన మోడరన్ లవ్ హైదరాబాద్ అనే వెబ్ సిరీస్ లో నటించాడు..జులై 8 వ తేదీన ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ లో అందుబాటులోకి వచ్చింది..పాజిటివ్ రివ్యూస్ ని సంపాదించుకున్న ఈ వెబ్ సిరీస్ ని మీరు కూడా ఒక చూపు చూసేయండి..ఈ వెబ్ సిరీస్ లో అభిజీత్ తో పాటుగా నిత్యా మీనన్ మరియు ఆది పినిశెట్టి వంటి పాపులర్ యాక్టర్స్ కూడా నటించారు.