Ghani Movie: మెగా ఫ్యామిలి నుంచి “ముకుంద” సినిమాతో తెలుగు తెరకు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు వరుణ్ తేజ్. కంచె చిత్రంతో తనలోని నటుడికి ప్రాణం పోసి ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు ఈ యంగ్ హీరో. ఆ తర్వాత వచ్చిన లోఫర్, ఫిదా, గద్దలకొండ గణేశ్ చిత్రాలు బాక్సాఫీసు వద్ద మంచి కలెక్షన్లు కురిపించాయి. ఇక విక్టరీ వెంకటేష్ తో కలిసి “ఎఫ్ 2” సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకున్నారు వరుణ్. ఆ చిత్రం కూడా మంచి విజయం సాధించిన విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు వరుణ్ తేజ్ “గని” సినిమాలో నటిస్తున్న విశయం తెలిసిందే. తాజాగా ఈ మూవీ కి సంబంధించి ఓ అప్డేట్ ను చిత్ర బృందం ప్రకటించింది.
ఈ సినిమా టీజర్ విడుదల తేదీ తో పాటు సినిమాలో పాత్రలను పరిచయం చేసింది చిత్ర బృందం. నవంబర్ 15 వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేసింది. అలాగే.. ఈ సినిమా పాత్రలను పరిచయం చేస్తూ ఓ వీడియోను విడుదల చేసింది చిత్ర బృందం. ఇక ఈ అప్డేట్ తో మెగా ప్యాన్స్ లో నూతన కోలాహలం నెలకొంది. ఈ సినిమా ను టాలెంటెడ్ డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి తెరకెక్కిస్తున్నారు. కాగా సిద్దు ముద్ద, అల్లు బాబీ కలిసి ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీ లో సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తుండగా… తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. కాగా ఈ సినిమాను డిసెంబర్ 3 వ తేదీన విడుదల చేయనున్నారు.
Here it is, Introducing the characters from the World Of #Ghani 🥊
Mega Prince @IAmVarunTej 's #GhaniTeaser Releasing on 15th Nov! 🔥@nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @IamJagguBhai @Naveenc212 @MusicThaman @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/46pihdRuAe
— Geetha Arts (@GeethaArts) November 11, 2021
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Big update from varun tej ghani movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com