అయితే తాజాగా ఖిలాడీ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం ప్రకటించింది. వచ్చే ఏడాది శివ రాత్రి కానుకగా ఫిబ్రవరి 11 న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా వెల్లడించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఓ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ఇక ఈ తాజా అప్డేట్ తో రవితేజ అభిమానుల్లో సందడి వాతావరణం నెలకొంది. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర పోస్టర్లు, టీజర్, పాటలకు అభిమానులను విపరీతంగా ఆకట్టుకున్నాయి.
See you in cinemas 😎 #Khiladi
February 11th, 2022. pic.twitter.com/vCW6y3P1Kf
— Ravi Teja (@RaviTeja_offl) November 11, 2021
మరోవైపు రవితేజ శరత్ మండవ దర్శకత్వంలో… యసెల్వీ సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ‘రామారావు ఆన్ డ్యూటీ’ చిత్రంలో కూడా నటిస్తున్నారు. మాస్ మహారాజా సరసన మజిలీ బ్యూటీ దివ్యాన్ష్ కౌశిక్, మలయాళ కుట్టి రజిషా విజయన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అలానే ధమాకా, రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు చిత్రాల్లో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా ఉన్నాడు రవితేజ. ఈ సినిమాపై టాలీవుడ్ లో మంచి అంచనాలే నెలకొన్నాయి.