Krishnam Raju Funeral: తెలుగు చిత్రసీమలో శ్రీ కృష్ణంరాజు గారి మరణం జీర్ణించుకోలేకపోతున్నారు సినీ ప్రముఖులు. రెబల్ స్టార్ మరణవార్త అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్ స్టార్ కృష్ణం రాజు మరణంతో ప్రభాస్ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభాస్ జీవితంలో ఈ ఉదయం విషాద ఉదయంగా మారిపోయింది. ప్రభాస్ సన్నిహితులు తాజాగా కృష్ణంరాజు గారి అంత్యక్రియలకు సంబంధించిన ఓ వార్త అధికారికంగా తెలిపారు.

కృష్ణంరాజు గారి అంత్యక్రియలు రేపు అనగా సెప్టెంబర్ 12వ తేదీ సోమవారం నాడు జరుపుతామని కృష్ణంరాజు ఫ్యామిలీ మెంబర్స్ స్పష్టం చేశారు. ప్రభాసే కృష్ణంరాజుకి తలకొరివి పెట్టనున్నారు. ఇక ప్రభాస్ పరిస్థితి చూసి ఆయన అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు. కృష్ణం రాజుకు సంతాపం చెబుతూనే…స్టే స్ట్రాంగ్ ప్రభాస్ అన్నా అని ట్వీట్లు చేస్తున్నారు.
ప్రభాస్‌కు కృష్ణం రాజు పెదనాన్నే అయినా ఆయన రెబల్ స్టార్ వారసత్వాన్ని అందుకున్న ప్రభాస్ కృష్ణం రాజు కుమారుడిగానే అభిమానులకు పరిచయమయ్యారు. ఇద్దరూ కలిసి బిల్లా, రెబల్, రాధేశ్యామ్ వంటి సినిమాల్లో నటించారు. అందుకే.. మొదటి ప్రభాస్ ఫ్యాన్స్ కూడా కృష్ణం రాజుగారిని ప్రభాస్ సొంత తండ్రిగానే భావించారు.

ఏది ఏమైనా కృష్ణం రాజు ప్రజా జీవితంలోనూ ఎంతో హుందాగా మెలిగారు. కేంద్ర మంత్రిగా కృష్ణం రాజు గారు సేవలందించారు. సినీ జీవితంలోనూ, ప్రజా జీవితంలోనూ కృష్ణం రాజు గారు ఎంతో బాధ్యతాయుతంగా వారు అందించిన సేవలు మరువలేనివి. మా ‘ఓకేతెలుగు.కామ్’ తరఫున శ్రీ కృష్ణంరాజు గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ, శోహార్తులైన వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాము.