https://oktelugu.com/

Salaar: సలార్ సినిమా పై బిగ్ అప్ డేట్.. రంగంలోకి ప్రభాస్.. వచ్చే వారమే డేట్ ఫిక్స్ !

Salaar: కృష్ణంరాజు గారి మరణం అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్‌ స్టార్‌ మరణంతో ప్రభాస్‌ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అందుకే, ప్రభాస్ 20 రోజుల పాటు తన సినిమాల షూటింగ్స్ అన్నీ ఆపేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఐతే వచ్చే వారం నుంచి ప్రభాస్ సలార్ షూట్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. కారణం సలార్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఒకవేళ ఇప్పుడు షూట్ చేయలేకపోతే సలార్ సినిమా రిలీజ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : September 17, 2022 / 04:39 PM IST
    Follow us on

    Salaar: కృష్ణంరాజు గారి మరణం అందర్నీ శోకసంద్రంలోకి తీసుకెళ్లింది. ముఖ్యంగా రెబల్‌ స్టార్‌ మరణంతో ప్రభాస్‌ అండ్ ఆయన అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. అందుకే, ప్రభాస్ 20 రోజుల పాటు తన సినిమాల షూటింగ్స్ అన్నీ ఆపేస్తున్నారు అని వార్తలు వచ్చాయి. ఐతే వచ్చే వారం నుంచి ప్రభాస్ సలార్ షూట్ లో పాల్గొనబోతున్నాడని తెలుస్తోంది. కారణం సలార్ రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    prabhas

    ఒకవేళ ఇప్పుడు షూట్ చేయలేకపోతే సలార్ సినిమా రిలీజ్ పోస్ట్ ఫోన్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. అందుకే.. ప్రభాస్ కష్టమైన సలార్ సినిమాకి డేట్స్ ఇచ్చాడు. కేజీఎఫ్ లాంటి హై వోల్టేజ్ మూవీ తీసిన ‘ప్ర‌శాంత్ నీల్’ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రాబోతుంది ఈ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్. అన్నట్టు సలార్ షూటింగ్ ను తిరిగి స్టార్ట్ చేస్తే.. మూడు వారాల పాటు ఈ ‘సలార్’ కొత్త షెడ్యూల్ జరగనుంది.

    ఇక ఈ షెడ్యూల్ అంతా విలన్ డెన్ లో జరుగుతుందట. ఈ వీడియోలో లొకేషన్ కూడా డెన్ లోని ప్లేస్ లాగే ఉంది. అందుకే ‘సలార్’ విలన్ డెన్ కోసం ఈ సినిమా ఆర్ట్ డిపార్ట్మెంట్ భారీ సెట్ ను నిర్మించింది. ఈ సెట్ లోనే కీలకమైన యాక్షన్ సీన్స్ ను షూట్ చేస్తున్నారు. పైగా ప్రభాస్ పై యాక్షన్ సీన్స్ షూట్ చేస్తున్నారు. అందుకే ఈ సెట్ ను పలు విధాలుగా చెక్ చేసి అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు.

    prabhas

    ఏది ఏమైనా ప్రభాస్ తో హై వోల్టేజ్ యాక్షన్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సినిమా చేస్తున్నాడు అనగానే.. ‘సలార్’ పై పాన్ ఇండియా రేంజ్ లో భారీ అంచనాలు క్రియేట్ అయ్యాయి. అందుకే ప్రశాంత్ కూడా ఆ అంచనాలకు ఏ మాత్రం తీసిపోకుండా సినిమాని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాడు. నటీనటుల విషయంలో కూడా భారీ తారాగణాన్ని తీసుకున్నాడు.

    పాన్ ఇండియా లెవెల్ లో భారీ అంచనాల మధ్య రూపొందుతున్న ఈ సినిమాలో డార్లింగ్ సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పైగా నేషనల్ స్టార్ అయ్యాక ప్రభాస్ చేస్తున్న మొట్టమొదటి ఫుల్ యాక్షన్ కమర్షియల్ సినిమా ఇది. అందుకే, ఈ సినిమా కోసం సినిమా వాళ్ళు కూడా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి చూడాలి ఈ సినిమా ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో.

    Tags