అత్యంత ప్రజాదరణ పొందుతున్న షో లలో బిగ్ బాస్ ఒకటి. సౌత్ ఇండియా లో ఉన్న అన్ని భాషల్లో ప్రసారం అవుతూ అన్ని చోట్ల భారీ స్పందన మూటకట్టుకుంటుంది బిగ్ బాస్. కానీ తెలుగులో ఉన్న క్రేజ్ ఏ ఇతర భాషల్లో లేదు అనడంలో ఎటువంటి సందేహం లేదు. అందుకే తెలుగు బిగ్ బాస్ కి ఊహించని రీతి లో రేటింగ్ దక్కుతుంది. దీని ఫలితంగా పెద్ద రికార్డులను బ్రేక్ చేస్తుంది. తాజా నేపథ్యంలో ఒక షాకింగ్ న్యూస్ నేటిన్ట్లో హల్ చల్ చేస్తుంది. ఏంటంటే ….

విజయవంతం గా నాలుగు సీజన్లను పూర్తి చేసుకుని ఐదో సీజన్లో లోకి అడుగు పెట్టింది బిగ్ బాస్. దీని కారణం గా ఇదో సీజన్ మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి ప్రేక్షకుల్లో. ఎన్నడూ లేని విధంగా మొత్తం 19మంది కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టారు. ఆరంభంలోనే అధిరిపోయింది ఇంట్రో ఎపిసోడ్. దానికి అధికంగా 18 టి ఆర్ పి వచ్చింది. అంతేకాకుండా హౌస్ మేట్స్ గొడవలు, బూతులతో రెచ్చిపోయి తగినంత కంటెంట్ ఇచ్చి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేశారు.
ఇదిలా ఉండగా..బిగ్ బాస్ నిర్వాహకులు కొత్త కొత్త ప్రయోగాలు చేపడుడుతున్నారు బిగ్ బాస్ హౌస్ లో. ఎన్నడూ లేని విధంగా కొత్త టాస్క్ లను పరిచయం చేశారు. ఓపెన్ నామినేషన్స్ కే ఎక్కువ మొగ్గు చూపెడుతున్నాడు బిగ్ బాస్. అంతే కాకుండా అత్యధికంగా 8 మంది బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు రావడానికి నామినేట్ అయ్యారు. ఎవరంటే… నటరాజ్ మాస్టర్, ఆని మాస్టర్, ఆర్ జే కాజల్, వీజే సన్నీ, లోబో, ప్రియా, యాంకర్ రవి, సిరి నామినేట్ అయ్యారు.
తాజా సమాచారం ప్రకారం ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉండబోతుంది అని నెట్టింట్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే ఆని, లోబో, నటరాజ్ మాస్టర్ డేంజర్ జోన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఒకవేళ డబుల్ ఎలిమినేషన్ ఆదివారం ఈ ముగ్గురిలో ఇద్దరు ఎలిమినేట్ అవ్వడం ఖాయం. అంతే కాకుండా ఇదో వారం ప్రారంభం లో ఓ సెలబ్రిటీ వైల్డ్ కార్డ్ హౌస్ లోకి ఎంట్రీ ఇస్తుందని సోషల్ మీడియా లో వినిపిస్తోంది. అది ఇంకా ఎవరన్న దాని పై క్లారిటీ లేదు కానీ … హౌస్ లోకి వచ్చే వారి గురించి యాంకర్ వర్షిణి, సీరియల్ ఆర్టిస్ట్ నవ్య స్వామి పేర్లు మాత్రం గట్టిగా వినిపిస్తున్నాయి