Tollywood: వారంలోనే సినిమా హిట్టా ఫట్టా తేల్చేస్తున్న ప్రేక్షకులు.. దీనివల్ల అలాంటి సినిమాలకు నష్టమే…

Tollywood: సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. దానివల్లే ఇప్పుడు వంద రోజుల ఫంక్షన్ జరగడం లేదు... సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు సక్సెస్ మీట్ పెట్టీ సినిమా సక్సెస్ అని చెప్తున్నారు.

Written By: Gopi, Updated On : July 6, 2024 1:54 pm

The audience is deciding the movie hit or flop within a week

Follow us on

Tollywood: ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ అయిన సినిమాకు వంద రోజుల ఫంక్షన్స్ అనేది చాలా గ్రాండ్ గా నిర్వహించేవారు. ఈ ఫంక్షన్ కి సినిమాలో నటించిన నటీనటులతో పాటు చీఫ్ గెస్ట్ లు కూడా వచ్చేవారు. కానీ ఇప్పుడు రోజులు మారిపోయాయి. ఒక సినిమా అనేది 100 రోజులు కాదు కరెక్ట్ గా వారం కూడా ఆడటం లేదు. ఇక పెద్ద సినిమాలైతే ఒక వారం రోజుల్లోనే ఆ సినిమా రిజల్ట్ మొత్తం తెలిసిపోతుంది.

అలాగే ఆ సినిమా ఎంత కలెక్ట్ చేస్తుంది అనేది కూడా తెలుస్తుంది. దానివల్లే ఇప్పుడు వంద రోజుల ఫంక్షన్ జరగడం లేదు… సినిమా రిలీజ్ అయిన రెండు రోజులకు సక్సెస్ మీట్ పెట్టీ సినిమా సక్సెస్ అని చెప్తున్నారు. ఇక మొదటి షో తోనే సినిమా హిట్టా ఫట్టా అని తేల్చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి వాటి వల్ల సినిమా హిట్టయిందా, ఫట్టయిందా అనేది తేల్చడం వరకు ఓకే కానీ కొన్ని సినిమాలు స్లో గా పికప్ అవుతూ ఉంటాయి. కొన్ని రోజుల వరకు టైమ్ తీసుకొని ఆ తర్వాత సూపర్ సక్సెస్ లుగా మారుతాయి.

నిజానికి మహేష్ బాబు పూరిజగన్నాథ్ డైరెక్షన్ లో చేసిన ‘పోకిరి ‘ సినిమాకి మొదటి రోజు ప్లాప్ టాక్ వచ్చింది. పది రోజుల వరకు డివైడ్ టాక్ తో నడిచింది. పదకొండో రోజు నుంచి సినిమా హిట్ టాక్ రావడమే కాకుండా లాంగ్ రన్ లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఇక దేవదాస్ సినిమా ఒక 20 రోజుల తర్వాత హిట్ టాక్ తెచ్చుకొని 175 డేస్ ఆడింది. మరి ఇలాంటి సినిమాలు ఇప్పుడు వస్తే మాత్రం ఆ సినిమాలను పక్క ప్లాప్ లుగా ముద్రిస్తారు.

ఇక అప్పటికి ఇప్పటికి ఉన్న తేడా ఏంటంటే అప్పట్లో సినిమాలు వారం గడిచిన తర్వాత నిదానంగా కలెక్షన్స్ ను వసూలు చేస్తూ సక్సెస్ టాక్ ని తెచ్చుకుంటూ ముందుకు సాగుతూ ఉండేవి. కానీ ఇప్పుడున్న జనరేషన్ లో రెండు రోజులలో సినిమా లెక్క తేల్చేసి పక్కన పడేస్తున్నారు. అలా చేయడం వల్ల కొన్ని సినిమాలకు మైనస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి…