Liger Movie: లైగర్ విడుదలకు సమయం దగ్గరపడుతుండగా టీమ్ కి బిగ్ షాక్ తగిలింది. సోషల్ మీడియాలో బాయ్ కాట్ లైగర్ (#BoycottLiger) హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ అవుతుంది. సినిమా ఫలితాన్ని దెబ్బతీసే ఇలాంటి నెగిటివ్ ట్రెండ్స్ పట్ల లైగర్ టీమ్ లో వణుకు మొదలైంది. ప్రస్తుతం బాలీవుడ్ లో బాయ్ కాట్ ట్రెండ్ నడుస్తుంది. సామాజిక, మతపరమైన అంశాలపై ఎవరైనా హీరో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే, ప్రేక్షకులు సదరు హీరో సినిమా చూడవద్దని సోషల్ మీడియాలో పిలుపునిస్తున్నారు. ఇటీవల విడుదలైన లాల్ సింగ్ చడ్డా సినిమాను బాయ్ కాట్ చేయాలని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో ట్రెండ్ చేశారు.

ఈ మూవీ ప్రమోషన్స్ లో అమిర్ ఖాన్ కొన్ని మతపరమైన కామెంట్స్ చేశారు. హిందువుల మనోభావాలు దెబ్బతీసిన అమిర్ ఖాన్ కి సినిమాను బాయ్ కాట్ చేయడం ద్వారా బుద్ధి చెప్పాలని నెటిజెన్స్ డిసైడ్ అయ్యారు. అలాగే ఆ మూవీ హీరోయిన్ కరీనా కపూర్ సైతం కొంచెం ఘాటుగా మాట్లాడంతో లాల్ సింగ్ చడ్డా పై కక్ష సాధించారు. కొన్ని రోజులు బాయ్ కాట్ విక్రమ్ వేద ట్రెండ్ నడిచింది. అమిర్ ఖాన్ కి హృతిక్ రోషన్ మద్దతు తెలిపిన నేపథ్యంలో విక్రమ్ వేద చిత్రాన్ని బహిష్కరించాని నెటిజెన్స్ నిర్ణయించారు.
తాజాగా లైగర్ చిత్రాన్ని నెటిజెన్స్ టార్గెట్ చేశారు. విజయ్ దేవరకొండ హీరోగా పూరి తెరకెక్కించిన లైగర్ చిత్రాన్ని టార్గెట్ చేయడం వెనుక చాలా కారణాలు ఉన్నాయి. ఈ మూవీ సహనిర్మాతగా కరణ్ జోహార్ ఉన్నారు. హీరోయిన్ అనన్య పాండే కావడం మరొక కారణం. సుశాంత్ సింగ్ మరణం తర్వాత కరణ్ జోహార్ పై తీవ్ర వ్యతిరేకత మొదలైంది. అలాగే స్టార్ కిడ్స్ అంటే జనాలు మండిపడుతున్నారు. నేపోటిజం కారణంగానే సుశాంత్ మరణించాడని భావిస్తున్న నెటిజెన్స్… అలియా భట్, అనన్య, కరీనా కపూర్ పట్ల వ్యతిరేకత కలిగి ఉన్నారు.

అలాగే హైదరాబాద్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ ఆటిట్యూడ్ చూపిస్తూ అమర్యాదకరంగా కూర్చోవడం కూడా విమర్శల పాలైంది. ఇలా పలు కారణాలతో లైగర్ చిత్రాన్ని ఓ వర్గం వ్యతిరేకిస్తున్నారు. బాయ్ కాట్ లైగర్ అనే హ్యాష్ ట్యాగ్ ట్రెండ్ చేస్తున్నారు. సోషల్ మీడియా వ్యతిరేకతకు గురైన లాల్ సింగ్ చడ్డా దారుణమైన ఫలితం అందుకుంది. అమిర్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్ అయ్యింది. అదే పరిస్థితి లైగర్ కి ఎదురైతే ఊహించడం కూడా కష్టం. ఉన్నవన్నీ ఊడ్చి లైగర్ చిత్రాన్ని పూరి-ఛార్మి నిర్మించారు. ఈ మూవీ అటూ ఇటూ అయితే ఆర్థికంగా తీవ్రస్థాయిలో నష్టపోవాల్సి వస్తుంది.
[…] […]