Keerthy Suresh: సూపర్ స్టార్ మహేష్ బాబు – సెన్స్ బుల్ డైరెక్టర్ పరశురామ్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘సర్కారు వారి పాట’. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీ నుంచి ‘కళావతి’ అంటూ సాగే మెలోడీ సాంగ్‌ను రిలీజ్ చేస్తామని చిత్రయూనిట్ ప్రకటించింది. నిజానికి ఈ సినిమా నుంచి లవ్ సాంగ్ రాబోతుందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఆ వార్తలే నిజం అయ్యాయి.

ఇక ఈ సినిమా లవ్ సాంగ్ కోసం ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా ఈ సాంగ్ పోస్టర్ ను రిలీజ్ చేసి చిత్రబృందం క్లారిటీ ఇచ్చింది. కాగా పోస్టర్ లో కీర్తి సురేష్ భుజం మీద వాలిన మహేష్ ను చూపించారు. పోస్టర్ ను చూస్తుంటేనే ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఏ రేంజ్ లో ఉందో అర్ధం అవుతుంది.
Also Read: ఏంటీ ఈ పెద్ద సినిమా పోస్టర్లు అన్నీ కాపీయేనా.. ఎంత మాయ చేశారు..!
మొత్తానికి మహేష్ – కీర్తి లుక్స్ అండ్ గెటప్స్ కూడా చాలా బాగున్నాయి. చంద్రబోస్ రాసిన ఈ లవ్ సాంగ్ చాలా ఎఫెక్టివ్ గా ఉంటుందట. మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా రానున్న ఈ ఫస్ట్ సింగిల్ లో సినిమా మొత్తంలోనే హైలైట్ గా నిలుస్తోందట. ఈ మూవీ నుంచి మాస్ పాట వస్తుందని తొలుత అంతా భావించారు. కానీ ప్రేమికుల దినోత్సవం రోజున రానుండటంతో లవ్ సాంగ్ ను రిలీజ్ చేస్తున్నారు.

మొత్తానికి ‘సర్కారు వారి పాట’ భారీ కమర్షియల్ హిట్ అయ్యేలా ఉందని మేకర్స్ కూడా చాలా నమ్మకంగా ఉన్నారు. కాగా మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎమ్ బి ఎంటర్టైన్మెంట్ ,14 రీల్స్ ప్లస్ సంస్థలు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.
Also Read: భారీ రోడ్డు ప్రమాదం.. హీరోలా వచ్చి కాపాడిన సోనూసూద్ !