https://oktelugu.com/

కరోనాలో కూడా లవ్ సీన్స్ కోసం.. !

నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ‘ మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్నా.. పెద్దగా కలెక్షన్స్ ను మాత్రం సాధించలేకపోయింది. కలెక్షన్స్ రాబట్టలేని సినిమాని మన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ, జెర్సీ సినిమాని మాత్రం అందరూ పొగిడారు. పైగా పక్క భాష వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అయి మరీ రీమేక్ రైట్స్ ను తీసుకున్నారు. ఈ క్రమంలో హిందీలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతుంది. బాలీవుడ్ […]

Written By:
  • admin
  • , Updated On : August 12, 2020 / 03:38 PM IST
    Follow us on


    నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన క్లాస్ మూవీ ‘జెర్సీ‘ మంచి హిట్ టాక్ ను తెచ్చుకున్నా.. పెద్దగా కలెక్షన్స్ ను మాత్రం సాధించలేకపోయింది. కలెక్షన్స్ రాబట్టలేని సినిమాని మన వాళ్ళు పెద్దగా పట్టించుకోరు. కానీ, జెర్సీ సినిమాని మాత్రం అందరూ పొగిడారు. పైగా పక్క భాష వాళ్ళు కూడా గొప్పగా ఫీల్ అయి మరీ రీమేక్ రైట్స్ ను తీసుకున్నారు. ఈ క్రమంలో హిందీలో కూడా ఈ సినిమా భారీ స్థాయిలోనే రీమేక్ అవుతుంది. బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకోవడమే ఈ సినిమాకి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మృణాల్‌ ఠాకూర్‌ కనిపించనుంది. షాహిద్ – మృణాల్ జంట బాగుందని ఇప్పటికే బాలీవుడ్ లో పాజిటివ్ టాక్ వచ్చింది.

    Also Read: విజయ్ ‘ఫైటర్’ లేటెస్ట్ యవ్వారాలు !

    అయితే ఇప్పటికే ఈ సినిమా చాల భాగం రెగ్యులర్ షూటింగ్ పూర్తి చేసుకున్నప్పటికీ.. క్లైమాక్స్ అండ్ కొన్ని కీలక సన్నివేశాల షూట్ మాత్రం ఇంకా బ్యాలెన్స్ ఉంది. ఈ బ్యాలెన్స్ పార్ట్ ను గుజరాత్ లో షూట్ చేయాలని మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఇంకా అక్కడ కరోనా ఎఫెక్ట్ ఉన్నా, షూట్ ను మాత్రం పోస్ట్ ఫోన్ చేయకుండా పూర్తి చేయాలని మేకర్స్ డిసైడ్ అయ్యారట. అందుకే కరోనా ప్రభావంలో కూడా గుజరాత్ లోనే చిత్రబృందం ఈ నెల మూడో వారం నుండి షూట్ ప్లాన్ చేస్తోందని.. గుజరాత్ లోని లొకేషన్స్ సినిమాలోని సీన్స్ కి బాగా సూట్ అవుతాయని.. అందుకే కష్టం అయినా అక్కడే లవ్ స్టోరీకి సంబంధించిన సీన్స్ ను షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది.

    Also Read: పెళ్లి చేసుకునే లోపే ఛాన్స్ లు ఇచ్చేయండి !

    కాగా షాహిద్ ఈ సినిమా కోసం ప్రత్యేకంగా ఓ క్రికెటర్ దగ్గర ట్రైనింగ్ కూడా తీసుకుని మరీ ఈ సినిమాలో నటిస్తున్నాడు. షాహిద్ కపూర్ ఇంతకుముందే తెలుగు చిత్రం ‘అర్జున్ రెడ్డి’ని హిందీలోకి ‘కబీర్ సింగ్’ పేరుతో రీమేక్ చేసి భారీ హిట్ అందుకోవడం, మళ్ళీ ఇప్పుడు తెలుగు సినిమానే రీమేక్ చేస్తుండటంతో బాలీవుడ్ లో ఈ సినిమాకి భారీ అంచనాలు ఏర్పడ్డాయి. తెలుగు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి హిందీ వర్షన్ ను కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. గౌతమ్ నిజంగా లక్కీ అనే చెప్పాలి. మూడో సినిమాకే వంద కోట్ల హీరోని పట్టేశాడు.