https://oktelugu.com/

Shekar Bhasha : బిగ్ బ్రేకింగ్ : పోలీసుల అదుపులో బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు కంటెస్టెంట్.. అసలు ఏమైందంటే!

టాస్కులు కూడా అవకాశం దొరికినప్పుడల్లా అదరగొట్టేవాడు. చాలా హుషారుగా ఉండేవాడు. అలాంటి వాడు ఎలిమినేట్ అవ్వడం సరైన విషయం కాదు అనేది లక్షలాది మంది అభిమానుల అభిప్రాయం. ఇది కాసేపు పక్కన పెడితే శేఖర్ బాషా పై సైబర్ క్రైమ్ కేసులో పోలీసులు అదుపు తీసుకున్నారు.

Written By:
  • Vicky
  • , Updated On : October 18, 2024 / 10:22 PM IST

    Shekar Bhasha

    Follow us on

    Shekar Bhasha :  ఈ సీజన్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టి రెండవ వారం ఎలిమినేట్ అయ్యి బయటకి వచ్చిన కంటెస్టెంట్ శేఖర్ బాషా. ఇతని ఎలిమినేషన్ ఆడియన్స్ కి అన్యాయం గా అనిపించింది. ఎందుకంటే శేఖర్ బాషా హౌస్ లో ఉన్నన్ని రోజులు తనదైన మార్క్ జోకులు వేస్తూ కడుపుబ్బా నవ్వించేవాడు. టాస్కులు కూడా అవకాశం దొరికినప్పుడల్లా అదరగొట్టేవాడు. చాలా హుషారుగా ఉండేవాడు. అలాంటి వాడు ఎలిమినేట్ అవ్వడం సరైన విషయం కాదు అనేది లక్షలాది మంది అభిమానుల అభిప్రాయం. ఇది కాసేపు పక్కన పెడితే శేఖర్ బాషా పై సైబర్ క్రైమ్ కేసులో పోలీసులు అదుపు తీసుకున్నారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే ప్రముఖ యూట్యూబర్ హర్ష సాయి పై మిత్రా అనే అమ్మాయి మోసం చేశాడంటూ పోలీస్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే.

    ఈ ఘటనకు శేఖర్ బాషా కి కూడా సంబంధం ఉందని బాధితురాలు ఫిర్యాదు ఇవ్వడం, పోలీసులు నేడు ఆయన్ని అదుపులోకి తీసుకొని సుమారుగా మూడు గంటల నుండి ప్రశ్నిస్తున్నారు. శేఖర్ బాషా అన్యాయంగా తనపై నిరాధార ఆరోపణలు చేసాడని ఆమె కేసు లో పేర్కొనింది. హర్ష సాయి డబ్బులిచ్చి ఇతన్ని తన మీదకు వదిలాడని, ఏ తప్పు చేయకపోయినా, ఎలాంటి ఆధారాలు లేకుండా ఇతను నాపై అసత్య ఆరోపణలు చేస్తూ మానసికంగా ఎంతో కృంగిపోయేలా చేసాడని ఆమె చెప్పుకొచ్చింది. అందుకే పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రేడియో జాకీ గా మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్న ఆయన, తన యూట్యూబ్ ఛానల్ ద్వారా మగవాళ్లపై జరిగే అన్యాయాల గురించి మాట్లాడుతూ ఉంటాడు. రీసెంట్ గా ఆయన రాజ్ తరుణ్, లావణ్య కేసు విషయంలో రాజ్ తరుణ్ తరుపున నిలబడి మాట్లాడిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఎన్నో టీవీ డిబేట్స్ లో పాల్గొని రాజ్ తరుణ్ కంటే ఎక్కువగా పోరాడాడు. చివరికి తప్పు లావణ్య వైపే ఉందని ఆధారాలతో సహా నిరూపించి నేషనల్ వైడ్ గా ట్రెండింగ్ టాపిక్ అయ్యాడు.

    ఈ కేసు వల్ల వచ్చిన పాపులారిటీ కారణంగానే ఆయనకి బిగ్ బాస్ లోకి అడుగుపెట్టే ఛాన్స్ దొరికిందని అందరూ అంటూ ఉంటారు. ముమ్మాటికీ అది నిజమే. బిగ్ బాస్ హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత కూడా శేఖర్ బాషా ఇదే తరహా ధోరణితో ముందుకు దూసుకుపోతున్నాడు. అన్యాయంగా అమాయకపు మగవాళ్ళు బలైపోతున్నారు అని ఆయనకు అనిపించినప్పుడల్లా తన గొంతుని వినిపిస్తున్నాడు. హర్ష సాయి విషయం ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడిన శేఖర్ బాషా, జానీ మాస్టర్ కేసు పై నోరు మెదపకపోవడం గమనార్హం. అంటే జానీ మాస్టర్ విషయంలో శేఖర్ బాషా నమ్మడం లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఇదంతా పక్కన పెడితే హర్ష సాయి వ్యవహారం లో శేఖర్ బాషా నిజంగానే అసత్య వ్యాఖ్యలు చేశాడా లేదా అనేది మరో రెండు మూడు రోజుల్లో పోలీస్ విచారణలో బయటపడనుంది.