Bigg Boss Vasanthi: బిగ్ బాస్ ఫేమ్ వాసంతి కృష్ణన్ కు నటిగా మంచి గుర్తింపు ఉంది. పలు సీరియల్స్ లో నటించి ప్రేక్షకుల అభిమానం పొందింది. బిగ్ బాస్ ద్వారా మరింత క్రేజ్ సంపాదించింది. సిరి సిరి మువ్వలు సీరియల్ తో ఎంట్రీ ఇచ్చింది.ఆ తర్వాత గుప్పెడంత మనసు, గోరింటాకు సీరియల్స్ తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైంది. క్యాలీఫ్లవర్, మనే నెంబర్ 67, భువన విజయం, సీఎస్ఐ సనాతన్ వంటి చిత్రాల్లో వాసంతి నటించింది. తెలుగుతో పాటు కన్నడలోనూ ఈ బ్యూటీ సినిమాలు చేసింది. తాజాగా ప్రియుడు పవన్ కళ్యాణ్ ని వాసంతి పెళ్లి చేసుకుంది.
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తితో వాసంతి కృష్ణన్ ప్రేమలో పడింది. పవన్ కళ్యాణ్ కూడా నటుడే. కొంతకాలం రిలేషన్ లో ఉన్న ఈ జంట 2023 డిసెంబర్ లో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూ కి హాజరైన వీరు కెమెరా ముందే ముద్దులు పెట్టుకుని రచ్చ చేశారు. వాళ్ళ తీరుకు సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా వాసంతి – పవన్ కళ్యాణ్ మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు.
వాసంతి సొంతూరు తిరుపతిలో మంగళవారం రాత్రి గ్రాండ్ గా పెళ్లి జరిగింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు సమక్షంలో వివాహం ఘనంగా జరిగింది. అనంతరం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు నవదంపతులు. వీరి వివాహ వేడుకకు కొందరు బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్స్, సీరియల్ నటులు హాజరయ్యారని సమాచారం. పవన్ కళ్యాణ్ కి వీరాభిమాని అయిన వాసంతి అదే పేరు ఉన్న వ్యక్తిని పెళ్లాడటం విశేషం.
కాగా వాసంతి భర్త పవన్ కళ్యాణ్ నటుడిగే ఎదిగే ప్రయత్నాల్లో ఉన్నాడు. అతడు హీరోగా రెండు సినిమాలు చేస్తున్నాడట. ఆ వివరాలు తెలియాల్సి ఉంది. కాగా వాసంతి తన పెళ్లి ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేయగా .. అవి కాస్తా వైరల్ గా మారాయి. ఇక అభిమానులు ఈ జంటకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బిగ్ బాస్ సీజన్ 6లో పాల్గొన్న వాసంతి 10 వారాలు హౌస్లో ఉంది.