Bhola Shankar Teaser: 24 వ తేదీన ‘భోళా శంకర్’ మూవీ టీజర్ విడుదల..ఫ్యాన్స్ కి ఇక పండగే!

మణిశర్మ కొడుకు మహతి సాగర్ అందించిన మ్యూజిక్ అందరికీ బాగా నచ్చింది. ఈ పాటతో పాటుగా సినిమాలో మరో రెండు పాటలు అద్భుతంగా వచ్చాయట.

Written By: Vicky, Updated On : June 22, 2023 5:15 pm

Bhola Shankar Teaser

Follow us on

Bhola Shankar Teaser: మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటిస్తున్న ‘భోళా శంకర్’ చిత్రానికి సంబంధించిన టీజర్ ఈ నెల 24 వ తేదీన విడుదల కాబోతున్నట్టు ఆ చిత్ర మేకర్స్ కాసేపటి క్రితమే అధికారికంగా ప్రకటించారు. మెహర్ రమేష్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ చిత్రం పై ప్రారంభం లో పెద్దగా అంచనాలు ఉండేవి కాదు కానీ, మొదటి లిరికల్ వీడియో సాంగ్ వచ్చినప్పటి నుండి మాత్రం అభిమానుల్లో అంచనాలు అమాంతం పెరిగి పోయాయి.

మణిశర్మ కొడుకు మహతి సాగర్ అందించిన మ్యూజిక్ అందరికీ బాగా నచ్చింది. ఈ పాటతో పాటుగా సినిమాలో మరో రెండు పాటలు అద్భుతంగా వచ్చాయట. అవి విడుదలైనప్పుడు సోషల్ మీడియా షేక్ అవుతుందని అంటున్నారు. ఇక పోతే ఈ సినిమా తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన అజిత్ వేదలమ్ చిత్రానికి రీమేక్ గా తెరకెక్కుతుంది. రీమేక్ అయ్యినప్పటికీ కూడా మెగాస్టార్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగానే ఈ సినిమాని మలిచాడట మెహర్ రమేష్.

ఇక ఈ చిత్రం లో చిరంజీవి కి జోడిగా తమన్నా నటిస్తుండగా,కీర్తి సురేష్ చిరంజీవి కి చెల్లెలుగా నటిస్తుంది. గతం లో కూడా ఆమె సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన పెద్దన్న అనే సినిమాలో రజినీకాంత్ కి చెల్లెల్లు గా నటించింది. మళ్ళీ ఇప్పుడు హీరోయిన్ గా కాకుండా ఇలా చెల్లి పాత్ర లో నటిస్తున్నది ఈ చిత్రం లోనే.

చిరంజీవి లాంటి స్టార్ హీరో సినిమా కావడంతో పాటుగా, నటనకి పూర్తి స్థాయి ప్రాధాన్యత ఉన్న పాత్ర కావడం తో ఈ చిత్రం లో ఆమె నటించడానికి ఒప్పుకుందట. ఆమె పాత్ర ఇచ్చే ట్విస్టులు కూడా అదిరిపోతాయని అంటున్నారు. రీసెంట్ గానే ఈ సినిమాలో కీలక ఘట్టం లో వచ్చే సంగీత్ సాంగ్ షూటింగ్ జరిగింది. ఈ సాంగ్ లో చిరంజీవి తో పాటుగా మూవీ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరు ఉన్నారు.ఇక ఎల్లుండి విడుదల అవ్వబొయ్యే టీజర్ ఏ రేంజ్ లో ఉండబోతుందో చూడాలి.