Bheemla Nayak Ticket Price in AP: ఏపీలో ఇప్పుడు మాస్ జాతర షురూ అయింది. పవన్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూసిన భీమ్లానాయక్ మూవీ గ్రాండ్ గా రిలీజ్ అయిపోయింది. అన్ని సెంటర్లలో టికెట్లు ఆల్రెడీ అమ్ముడు పోయాయి. ఎక్కడ చూసినా భీమ్లానాయక్ ఫీవరే కనిపిస్తోంది. అయితే ఏపీలో ఈ మూవీకి పాత రేట్లకే టికెట్లు అమ్మాలనే రూల్ ఇంకా సాగుతోంది. ఎలాగూ ఇంకో వారం తర్వాత కొత్త రేట్లు అందుబాటులోకి వస్తాయనే నమ్మకంతోనే మూవీని రిలీజ్ చేశారు.
అయితే ఎక్కడా కూడా ప్రభుత్వం సూచించిన రేటుకు టికెట్లను అమ్మడం లేదని తెలుస్తోంది. చాలా చోట్ల ఎగ్జిబ్యూటర్లు డిసైడ్ చేసిన రేట్లకే థియేటర్ యజమానులు టికెట్లు అమ్ముతున్నారు. అయితే ఇక్కడే థియేటర్ల యజమానులు ఓ ట్రిక్‌ను ఫాలో అవుతున్నారు. ఎలాగూ ప్రభుత్వం చెప్పిన రేటుకు టికెట్లు అమ్మితే లాభం ఉండదని టికెట్ ను గవర్నమెంట్ రూ.50 కి అమ్మమని చెబితే.. ఏకంగా రూ.150కు అమ్మేస్తున్నారు.
Also Read: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం
ఇది కొన్ని చోట్ల మాత్రమే. ఇక నెల్లూరు లాంటి సీడెడ్ ఏరియాల్లో మల్టీప్లెక్సుల్లో అయితే ఏకంగా తమ మనుషులను పెట్టి బ్లాక్‌లోనే అమ్మేస్తున్నారు. కొంటే కొనండి లేదంటే వెళ్లిపోండి అంటూ తెగేసి చెప్పేస్తున్నారు. ఇక నెల్లూరులోని ఎస్2 సినిమాస్ థియేటర్ లో ఓ కొత్త తరహా మోసం బయటకు వచ్చింది. ఈ థియేటర్ లో ఒక్కో టికెట్‌ను రూ.250 కి అమ్ముతున్నారు.
అయితే ఈ టికెట్ తో పాటు రూ.120 టోకెన్ ఇస్తున్నారు. ఈ టోకెన్ తీసుకుంటేనే మూవీ టికెట్ అమ్ముతామని తెగేసి చెబుతున్నారు. ఈ టోకెన్ స్నాక్స్‌కు సంబంధించిన టోకెన్ అంట. ఇంటర్వెల్ మధ్యలో ఈ టోకెన్‌ను చూపించి స్నాక్స్ తీసుకోవచ్చని థియేటర్ యజమానులు చెబుతున్నారు. అంటే ప్రేక్షకుడికి స్నాక్స్ తినడం ఇష్టం ఉన్నా లేకున్నా.. బలవంతంగా అమ్మేస్తున్నారన్నమాట. ఇంకో వైపు ఏపీ మొత్తం కూడా థియేటర్లలో ప్రభుత్వ రూల్స్ అతిక్రమిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. మరి ఇలా చేస్తే జగన్ సర్కార్ ఏమైనా యాక్షన్ తీసు్కుంటుందా లేదా అన్నది చూడాలి.