Bandla Ganesh Comments on Bheemla Nayak Movie: టాలీవుడ్ లో మిగతా హీరోలతో పోలిస్తే పవన్ కల్యాణ్‌కు ఉన్న ఫాలోయింగ్ వేరే లెవల్. అందరికీ ఫ్యాన్స్ మాత్రమే ఉంటారు. కానీ పవన్ కల్యాణ్‌కు భక్తులు కూడా ఉంటారండోయ్. ఈ మాట మేము చెప్పట్లేదు.. ఎన్నో సార్లు పవన్ ఫ్యాన్సే చెప్పారు. ఇక ఇండస్ట్రీలో సెలబ్రిటీలు కూడా పవన్‌కు పెద్ద ఫ్యాన్స్ అని అందరికీ తెలిసిన విషయమే.
bandla ganesh
ముఖ్యంగా బండ్ల గణేశ్ అయితే పవన్‌కు పరమ భక్తుడు. పవన్ కోసం ఎంతటి సాహసం అయినా చేస్తాడు. పవన్ కల్యాణ్ సినిమా వస్తుందంటే బండ్ల గణేశ్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. ఆయన వేరే ప్రొడ్యూసర్ తో సినిమా చేసినా సరే.. దాన్ని ప్రమోట్ చేసేందుకు నానా ప్రయాసలు పడుతుంటాడు బండ్ల. ఆడియో ఫంక్షన్ లో అయితే బండ్ల చేసే కామెంట్లు ఎంతలా వైరల్ అవుతాయో తెలిసిందే.
Also Read: భీమ్లానాయక్ పై జగన్ సర్కార్ నెగిటివ్ ప్రచారం
ఒక రకంగా చెప్పాలంటే పవన్ కల్యాణ్ అంటే బట్టలు చింపుకునేంత వీరాభిమాని అని అతనికి పేరుంది. అంతలా పవన్ కల్యాణ్‌ను నిత్యం జపిస్తుంటాడు బండ్ల. ఇక ఇప్పుడు పవన కల్యాణ్ పవర్ ఫ్యాక్టర్ గా రిలీజ్ అయిన భీమ్లానాయక్ విషయంలో కూడా బండ్ల తన మార్కును చూపించాడు. ఆడియో ఫంక్షన్ లో కనపించికపోయినా.. ట్విట్టర్ వేదికగా పవన్ మీద ఉన్న అభిమానాన్ని చాటిచెప్పాడు.
Bheemla Nayak Movie
ట్విట్టర్ ఖాతాలో పవన్‌ను దేవుడిని చేసేశాడు. మా దేవర పవన్ కల్యాణ్ నటించిన భీమ్లా నాయక్ మూవీతో రికార్డులు అన్నీ బద్దలయిపోవాలంటూ చెప్పారు. థియేటర్లలో బాక్సులు బద్దలవ్వాలని, అభిమానులు దిక్కులు పిక్కటిల్లేలా స్వాగతాలు చెప్పాలంటూ రాసుకొచ్చాడు. ఇక చివరగా చరిత్ర కోసం మీరు కాదు.. మీ కోసం చరిత్ర దేవర అంటూ పరమ భక్తిని చూపించాడు. ఈ ట్వీట్‌ను పవన్ ఫ్యాన్స్ రీట్వీట్లు చేస్తూ హోరెత్తిస్తున్నాడు. ఇక మూవీ కూడా ఉదయం నుంచే హిట్ టాక్ తో దుమ్ము లేపుతోంది. ఏ థియేటర్ దగ్గర చూసినా పవన్ ఫ్యాన్స్ హంగామానే కనిపిస్తోంది. చూస్తుంటే పుష్ప మూవీ రికార్డులు కూడా బద్దలయ్యేలా కనిపిస్తున్నాయి.
Also Read: ఆ ప్రాంతంలో పవన్ ఫ్యాన్స్ గొడవ.. రానా ఫ్యాన్స్ ఆందోళన